Mrunal thakur: హిందీ సీరియల్ ద్వారా కెరియర్ మొదలుపెట్టిన ప్రముఖ బ్యూటీ మృణాల్ ఠాకూర్ సీరియల్స్ తో మంచి ఇమేజ్ సొంతం చేసుకొని, ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం తెలుగులో వరస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది ఈ హీరోయిన్. ఈ క్రమంలో ఈ హీరోయిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు మీకోసం..
బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసిన ఈమె తెలుగులో దుల్కర్ సల్మాన్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాలో ప్రిన్సెస్ నూర్జహాన్ పాత్రలో నటించి అద్భుతమైన నటనతో తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకుంది.
ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో అదే తరహాలో ఎన్నో అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. చివరిగా తెలుగులో నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాలో నటించింది. శౌర్యువ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కియారా ఖన్నా అనే చైల్డ్ ఆర్టిస్టు నటించిన విషయం తెలిసిందే.
తాజాగా ఆ పాపతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంది. తండ్రి కూతుళ్ళ మధ్య ఉండే అనుబంధాన్ని డైరెక్టర్ శౌర్యువ్ చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ మాట్లాడుతూ.. ‘కియారా నాకంటే చిన్నదే, అయినా ఇప్పటికే నన్ను సినిమాలో భాగంగా యష్నా లేదా ఎం అనే పిలుస్తుంది. ఎప్పటికీ ఈ పాప నా మొదటి కూతురే.భవిష్యత్తులో నాకు పెళ్లి జరిగి పిల్లలు పుట్టినా.. వారు నాకు రెండో సంతానమే అవుతారు. ఎందుకంటే పాపతో ఉన్న అనుబంధం అలాంటిది’ అని చెప్పుకొచ్చారు.
‘పాప నుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను. తన కళ్ళతోనే ఎన్నో విషయాలు మాట్లాడేస్తూ .. నన్ను అబ్బురపరిచింది. పాపని నా కెరియర్ లో మర్చిపోలేను.’ అంటూ తెలిపింది. మృనాల్ మాటలకు పాప కియారా స్పందిస్తూ …’మిమ్మల్ని కలవడం అదృష్టంగా భావిస్తున్నాను.. మళ్ళీ మిమ్మల్ని కలుస్తానని అనుకుంటున్నాను..మీరు కూడా సమయం దొరికితే తప్పకుండా నన్ను కలవడానికి రండి.నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను’ అంటూ.. కియారా కన్నా పోస్ట్ చేసింది.
తాజాగా కియారా కన్నా.. చేసిన పోస్ట్ కి మృనాల్ వెంటనే స్పందించడం మరో విశేషం. మృనాల్ ఆ పాప చేసిన పోస్ట్ కి రెండు లవ్ ఎమోజి సింబల్స్.. ను జోడించి తన ప్రేమను కురిపించింది. మొత్తానికైతే మృనాల్ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి