Harish Shankar about Ustad Bhagat Singh: క్రియేటివ్ డైరెక్టర్ హరీష్ శంకర్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలోనే వీళ్లిద్దరి కాంబినేషన్లు.. రాబోతున్న రెండవ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్.. మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి కానీ.. సినిమా మాత్రం ఇంకా మొదలవలేదు.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటం వల్లే సినిమాలకి దూరంగా ఉంటున్నారు అని.. అందుకే సినిమా ఇంకా మొదలవలేదు అని పుకార్లు వినిపించాయి. అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమా కంటే ముందు.. ఓజి సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులు అసలు ఈ సినిమా.. ఉంటుందా లేదా అని కూడా ప్రశ్నలు వినిపించాయి.
తాజాగా సినిమా ఎందుకు లేట్ అవుతుంది అనే.. విషయం మీద క్లారిటీ ఇచ్చారు హరీష్ శంకర్. “ముందు ఒక కథ అనుకున్నాము.. ఆ తర్వాత అది వద్దు అని అనుకున్నాము. గబ్బర్ సింగ్ లాంటి హిట్ సినిమా తర్వాత మళ్లీ కలుస్తున్నాం కాబట్టి. ఇంకా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాము. షూటింగ్ మొదలయ్యాక పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ కుదరక.. లేట్ అయి ఉండొచ్చు కానీ సినిమా మొదలవడం పవన్ కళ్యాణ్ గారి వల్ల లేట్ అవ్వలేదు" అని అన్నారు హరీష్ శంకర్.
గబ్బర్ సింగ్ సినిమా ఎందుకు హిట్ అయింది అని చెబుతూ.. పవన్ కళ్యాణ్ ని ఒక అభిమాని ఎలా చూడాలి అనుకుంటున్నారో.. ఒక అభిమానిగా తనకి తెలుసు అని.. మా హీరో ఇలా డైలాగ్ చెప్పాలి ఇలా డాన్స్ చేయాలి..ఇలా ఫైట్ చేయాలి అని పవన్ కళ్యాణ్ అభిమానిగా చేసాము కాబట్టే అభిమానులకి నచ్చింది.. అని అన్నారు హరీష్ శంకర్.
ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ మళ్లీ ఎప్పుడు మొదలవుతుంది అని అడగగా.. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు కుదిరితే అప్పుడు షూటింగ్ మొదలవుతుంది అని అన్నారు. పైగా పవన్ కళ్యాణ్ మొన్ననే.. ఉపముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి.. అప్పుడే మళ్లీ సినిమాలు అని అడగడం కూడా సబబు కాదని అందుకే.. కొంత సమయం పట్టినా సరే సినిమా అయితే కచ్చితంగా ఉంటుంది అని అన్నారు హరీష్ శంకర్.
Read more: Ex CM YS Jagan: విమానంలో సామాన్యుడిలా మాజీ సీఎం వైఎస్ జగన్.. వైరల్ గా మారిన ఫోటోలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter