Ambani success story: అంబానీయా మజాకా.. సొంత కాళ్ల మీద 20 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం నిర్మించిన అనిల్ అంబానీ కుమారుడు

Jai Anmol Ambani: మన దేశంలో సంపన్న కుటుంబం అనగానే గుర్తొచ్చే ఏకైక పేరు అంబానీ కుటుంబం. అందికూడా ముఖేష్ అంబానీ కుటుంబం గురించే ప్రతీ ఒక్కరూ తలచుకుంటారు. కానీ ఆయన సోదరుడు అనిల్ అంబానీ వారసుడైన జై అన్మోల్ గురించి ఇప్పుడు అందరూ తలచుకుంటున్నారు. అందుకు కారణం ఏంటో తెలుసుకుందాం. 


 

1 /7

Anil Ambani's Savior Son: అంబానీ కుటుంబం అంటే ఇప్పుడు కేవలం ముఖేష్ అంబానీ  కుటుంబం ఒక్కటే గుర్తుకు వస్తుంది. కానీ 15 ఏళ్ల క్రితం అనిల్ అంబానీ పేరు సైతం ఫోర్బ్స్ కుబేరుల లిస్టులో టాప్ 5లో కనిపించేది. అయితే వ్యాపారం దెబ్బ తిని UK కోర్టులో దివాలా తీసినట్లు ప్రకటించిని తర్వాత ఆయన ప్రభ తగ్గిపోతూ వస్తోంది. కానీ అనిల్ అంబానీ  పెద్ద కుమారుడు జై అన్మోల్ అంబానీ అడాగ్ గ్రూప్ అంటే అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూపునకు ఆశాజ్యోతిగా మారాడు.    

2 /7

ఎన్నో ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ అడాగ్ గ్రూపును సమర్థ వంతంగా నడపడంలో అనిల్ అంబానీ కుమారులు జై అన్మోల్ అంబానీ, జై అన్షుల్ అంబానీలు సమర్థవంతంగా ముందుకు వెళ్తున్నారు. తాత ధీరూభాయ్ అంబానీ వారసత్వం పంచుకున్న అన్మోల్ అంబానీ దివాళా తీసిన కంపెనీని పునరుద్ధరించే పనిలో ఉన్నారు.   

3 /7

అన్మోల్ కృషితో రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ (RCL) మంచి రికవరీ సాధించింది. కుటుంబ వ్యాపారాన్ని పునరుజ్జీవింపజేయడంలో  అనిల్ అంబానీ పెద్ద కుమారుడు జై అన్మోల్ అంబానీ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం అన్మోల్ అంబానీ నికర విలువ రూ. 20,000 కోట్లకు పైగా ఉంది.   

4 /7

జై అన్మోల్ అంబానీ  ముంబైలోని కేథడ్రల్, జాన్ కానన్ స్కూల్‌లో పూర్తి చేసి UKలోని సెవెనోక్స్ స్కూల్‌లో తదుపరి విద్యను అభ్యసించారు. ఆ తర్వాత వార్విక్ బిజినెస్ స్కూల్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని అభ్యసించాడు.    

5 /7

అన్మోల్ కేవలం 18 సంవత్సరాల వయస్సులో ఇంటర్న్‌గా రిలయన్స్ మ్యూచువల్ ఫండ్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. 2016లో, అతను రిలయన్స్ క్యాపిటల్ బోర్డులో అదనపు డైరెక్టర్‌గా పనిచేశాడు. ఒక సంవత్సరంలోపు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందాడు. అతను 2018 నాటికి రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ బోర్డులలో చేరాడు. రిలయన్స్ క్యాపిటల్ స్టాక్ ధరలను 40 శాతం పెంచడం ద్వారా జపనీస్ సంస్థ నిప్పాన్ పెద్ద ఎత్తున పెట్టుబడిని పెట్టింది. ఈ విజయంతో  జై అన్మోల్ అంబానీ వ్యూహాత్మక దృష్టి బయటి ప్రపంచానికి తెలిసింది.   

6 /7

అన్మోల్ తన వ్యాపార అవసరాల కోసం వ్యక్తిగత విమానాలతో పాటు రోల్స్ రాయిస్ ఫాంటమ్, లంబోర్ఘిని గల్లార్డో వంటి హై-ఎండ్ మోడల్‌ ఖరీదైన కార్లను సేకరించారు.   

7 /7

ప్రముఖ వ్యాపారవేత్త , సామాజిక కార్యకర్త క్రిషా షాను అన్మోల్ వివాహం  చేసుకున్నాడు. దివంగత నికుంజ్ షా కుమార్తె క్రిషా షా వివిధ సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటుంది. ఆమె డిస్కో అనే సోషల్ నెట్‌వర్కింగ్ కంపెనీని నడుపుతోంది. ఆమె కరోనా అనంతరం ఉచిత మానసిక ఆరోగ్య సహాయాన్ని అందించడానికి ఆమె #LoveNotFear ప్రచారాన్ని ప్రారంభించారు.