Jio New Recharge Plans: ఈ ఆరు దేశాలకు వెళ్తున్నారా, జియో నుంచి బెస్ట్ రోమింగ్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

Jio New Recharge Plans: దేశంలో అతి పెద్ద ప్రైవేట్ టెలికం కంపెనీ రిలయన్స్ జియో కొత్త కొత్త ఆఫర్లు, రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటిస్తుంటుంది. కేవలం ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా పనిచేసే రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తుంటుంది. విదేశీయానం చేసేవారికి జియో బెస్ట్ రోమింగ్ ప్లాన్స్ అందిస్తోంది. ఆ ప్లాన్స్ ఏంటో తెలుసుకుందాం

Jio New Recharge Plans: రిలయన్స్ జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెట్టింది. ఇవి ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్స్. వేర్వేరు దేశాలకు వేర్వేరు ప్లాన్స్ ఉన్నాయి. యూఏఇ, సౌదీ అరేబియా, థాయ్‌లాండ్, కెనడా, యూరప్ దేశాలకు వెళ్లేవారికోసం కొన్ని ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఈ ప్లాన్స్ 898 రూపాయల నుంచి ప్రారంభమై 3851 రూపాయల వరకు ఉంటాయి.

1 /6

జియో థాయ్‌లాండ్ రీఛార్జ్ ప్లాన్ ఈ ప్లాన్ థాయ్‌లాండ్ కోసం. ఇందులో 1551 రూపాయల ప్లాన్ 14 రోజుల వ్యాలిడిటీని, 2851 రూపాయల ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. 

2 /6

జియో యూఏఇ రీచార్జ్ ప్లాన్ ఈ ప్లాన్ యూఏఇ దేశానికి వర్తిస్తుంది. 898 రూపాయలు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 7 రోజులు. ఇందులో డేటా, ఎస్ఎంఎస్, కాలింగ్ సౌకర్యం ఉంటుంది. ఇందులోనే 1598 రూపాయలు ప్లాన్ 14 రోజుల వ్యాలిడిటీతోనూ, 2998 రూపాయల ప్లాన్ 21 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. 

3 /6

జియో సౌదీ అరేబియా రీఛార్జ్ ప్లాన్ ఇది సౌదీ అరేబియాలో పనిచేస్తుంది. మూడు ప్లాన్స్ ఉన్నాయి. 891 రూపాయల ప్లాన్ 7 రోజులకు, 1291 రూపాయల ప్లాన్ 14 రోజులకు, 2891 రూపాయల ప్లాన్ 30 రోజులకు పనిచేస్తుంది. 

4 /6

జియో యూరప్ రీఛార్జ్ ప్లాన్ యూరప్ దేశాల్లో పనిచేస్తుంది. ఒకే ఒక ప్లాన్ ఉంది. 2899 రూపాయ రీఛార్జ్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. 

5 /6

జియో కరిబియన్ రీజన్ రీఛార్జ్ ప్లాన్ కరీబియన్ ప్రాంతంలో పనిచేస్తుంది. రెండు ప్లాన్స్ ఉన్నాయి. 1671 రూపాయల రీఛార్జ్ ప్లాన్ 14 రోజుల వ్యాలిడిటీని, 3851 రూపాయల ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. 

6 /6

జియో కెనడా రీఛార్జ్ ప్లాన్ ఇది కెనడాలో పనిచేస్తుంది. ఇందులో రెండు ప్లాన్స్ ఉన్నాయి. 1691 రూపాయల ప్లాన్ 14 రోజుల వ్యాలిడిటీని, 2881 రూపాయల ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది.