DA Hike Update: యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్) తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలలో మరో బంపర్ ఆఫర్ లభించనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచే అవకాశం కనిపిస్తోంది. అలాగే సెప్టెంబర్ మూడవ వారంలో 3 నుండి 4 శాతం ఈ DA పెంపు ప్రకటించవచ్చని తెలుస్తోంది.
ఢిల్లీలోని అధికారిక వర్గాల్లో నడుస్తున్న సమాచారం ప్రకారం ఈ నెల సెప్టెంబరు మూడో వారంలో కేంద్రంప్రభుత్వం డీఏ పెంపును ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ పెరుగుదల 3 శాతం అయ్యే అవకాశం ఉంది. అయితే ఇది దాదాపు 4 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. గత మార్చి 2024లో పెరిగిన డీఏలో, కేంద్ర ప్రభుత్వం బేసిక్ జీతంలో 4 శాతం నుండి 50 శాతం వరకు కరువు భత్యాన్ని పెంచింది.
ప్రభుత్వం డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్)ని కూడా 4 శాతం పెంచింది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ), పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్) ఇస్తారు. DA,DR అనేవి సంవత్సరానికి రెండుసార్లు సవరిస్తారు. ఇవి జనవరి, జూలై నుండి పరిగణలోకి తీసుకుంటారు.
ఈ నెలలో కేంద్ర ఉద్యోగులకు డీఏను మూడు శాతం పెంచినట్లయితే, మొత్తం డియర్‌నెస్ అలవెన్స్ 53 శాతానికి చేరుకుంటుంది. అయితే, కోవిడ్ మహమ్మారి మధ్య నిలిపివేయబడిన 18 నెలల డిఎ డియర్‌నెస్ రిలీఫ్‌లను ప్రభుత్వం విడుదల చేసే అవకాశం లేదు. చివరిసారిగా మార్చి 7, 2024 తేదీన కేంద్రం డీఏ పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. అయితే జనవరి 1, 2024 నుంచి పెంచిన డీఏ అమల్లోకి వచ్చింది.
Also Read : EPFO: ఈపీఎఫ్ ద్వారా రిటైర్మెంట్ నాటికి రూ. 43 లక్షల ఫండ్ కావాలంటే ఏం చేయాలో తెలుసుకోండి
అప్పట్లో కేంద్ర ఉద్యోగులకు డీఏ 50 శాతానికి పెంచారు. ప్రభుత్వం సాధారణంగా ప్రతి సంవత్సరం మార్చి సెప్టెంబరులో డీఏ పెంపును ప్రకటిస్తుంది. జూలై 2024 నుండి, DA పెరుగుదల శాతం 50.28% నుండి 53.36%కి పెరుగుతుందని అంచనా. ఈ పెంపు ద్వారా ఉద్యోగుల జీతంలో మూడు శాతం పెంపు ఉంటుంది. ఈసారి కూడా 4 శాతం డీఏ పెంపును ఆశిస్తున్నారు.
కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. మీడియాలో మాత్రం ఈసారి నాలుగు శాతం డీఏ పెరుగుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఏడవ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా జీతం పొందే ఉద్యోగులు పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది.
Also Read :Changes in September: సెప్టెంబర్ నుంచి ఈ 5 అంశాల్లో కీలక మార్పులు, ఇలా చెక్ చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.