Xiaomi 15 Series: వావ్‌.. 200 MP కెమెరాతో అద్భుతమైన Xiaomi 15 సిరీస్‌ రాబోతోంది!

Xiaomi 15 Series: వచ్చే అక్టోబర్‌లో ఎంతో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్స్‌ లాంచ్‌ కాబోతున్నాయి. అలాగే స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 చిప్‌సెట్ కూడా అప్పుడే అందుబాటులోకి రాబోతోంది. దీంతో చాలా కంపెనీ ఇదే ప్రాసెర్‌ అనేక మొబైల్స్‌ను లాంచ్‌ చేయనున్నాయి. ఇందులో భాగంగా Xiaomi కూడా తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే ఆ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసకుందాం.

1 /5

స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 చిప్‌సెట్‌లో Xiaomi లాంచ్‌ చేయబోయే మొబైల్స్‌లో 15 సిరీస్‌ ఒకటి. ఇది ప్రీమియం లుక్‌లో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది.   

2 /5

ఈ Xiaomi 15 సిరీస్‌ను కంపెనీ 2025 సంవత్సరంలో అందుబాటులోకి తీసుకు రానుంది. అంతేకాకుండా ఇది ఎంతో శక్తివంతమైన  సోనీ LYT-900 సెన్సార్ కెమెరాతో రాబోతోంది. ఇవే కాకుండా ఎన్నో రకాల ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది.   

3 /5

ఈ స్మార్ట్‌ఫోన్‌ అల్ట్రా మోడల్‌లో 200-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 10x ఆప్టికల్ జూమ్ సెటప్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి రానుంది.   

4 /5

ఈ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ ఎంతో శక్తివంతమైన 6200mAh బ్యాటరీతో అందుబాటులోకి రానున్నాయి. దీంతో పాటు దీని డిస్ల్పే 2K రిజల్యూషన్‌ సపోర్ట్‌తో రాబోతోంది. అంతేకాకుండా ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది. 

5 /5

ఈ 15 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ Android 15 ఆధారిత HyperOS 2.0పై పని చేస్తుంది. దీంతో పాటు 25010PN30G మోడల్స్‌లో లాంచ్‌ చేయబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ మొబైల్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.