Abhishek Sharma Girlfriend: ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరుఫున దుమ్ములేపి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ. ముఖ్యంగా ఈ సీజన్లో తన దూకుడైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. అదేజోరులో టీ20 టీమ్‌కు ఎంపికై.. తన పర్ఫామెన్స్తో అలరించాడు. నేడు (సెప్టెంబర్ 4)న బర్త్ జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అభిషేక్ శర్మ గర్ల్ ఫ్రెండ్ ఎవరు..? ఆమె ఏం చేస్తుంటారు..? వంటి విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఐపీఎల్లో అభిషేక్ శర్మ దుమ్ములేపే పర్ఫామెన్స్తో బౌలర్లకు దడ పుట్టించాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్‌తో కలిసి ఎస్ఆర్హెచ్కు రికార్డుస్థాయిలో స్కోర్లు అందించారు.
మాజీ మిస్ రాజస్థాన్ రన్నరప్ దియా మెహతా అభిషేక్ శర్మ గర్ల్‌ఫ్రెండ్ అంటూ ఇటీవల రూమర్లు పుట్టుకొచ్చాయి. ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫోటోషూట్ సమయంలో అభిషేక్ శర్మ, దియా కలిసి కనిపించడంతో ఈ పుకార్లు మరింత జోరుగా వ్యాపించాయి. వారి రిలేషన్షిప్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు.
మోడల్, ఫ్యాషన్ స్టైలిస్ట్‌గా దియా మెహతా ఫ్యాషన్ ప్రపంచంలో రాణిస్తోంది. అయితే అభిషేక్ శర్మతో ప్రేమ వ్యవహారంతో క్రికెట్ అభిమానుల దృష్టిలో పడింది.
అభిషేక్ శర్మ తన వ్యక్తిగత జీవితం గురించి బయటకు చెప్పలేదు. దియా మెహతాతో రిలేషన్‌షిప్‌ను సీక్రెట్‌గా మెయింటెన్ చేస్తున్నట్లు తెలిసింది.
తన గురించి ఎన్ని రూమర్లు వస్తున్నా.. వాటిని అభిషేక్ శర్మ పక్కనబెట్టి కెరీర్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాడు.
టీ20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు వీడ్కోలు పలకడంతో అభిషేక్ శర్మ ఓపెనర్‌గా తన స్థానం సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నాడు.
దియా మెహతాతో సంబంధం గురించి అభిషేక్ శర్మ ఎప్పుడూ మాట్లాడలేదు. ఇద్దరు కూడా ఈ విషయంపై మౌనం వహిస్తున్నారు. పుకార్లు నిజమైతే అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.