బాలయ్యను ఢీకొట్టేందుకు సై అంటున్న నమిత !

బాలయ్యను నమిత ఢీకొట్టడం ఏంటని ఆశ్చర్య పోతున్నారా ? వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది.

Last Updated : Jul 30, 2019, 05:57 PM IST
బాలయ్యను ఢీకొట్టేందుకు సై అంటున్న నమిత !

గ్లామర్ తారాగా సౌత్ ఇండస్ట్రీలో మెరిసిన నమిత త్వరలో తెలుగు ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. అది కూడా ఎవరూ ఊహించని సరికొత్త అవతారంలో కనిపించేందుకు సిద్ధమౌతోంది.
బాలయ్యకు విలన్ గా నమిత !!
సొగసరి భామ నమిత మరోసారి బాలయ్య మూవీలో మెరవబోతోంది. అయితే ఈ సారిగా హీరోయిన్ కాదు ..స్పెషల్ పాత్రలో...ఈ సారి లేడీ విలన్ సరికొత్త అవతారం కనిపించబోతోంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న  ఈ  సినిమాలో నమిత నెగెటివ్ షేడ్స్ లో కనిపించనుంది. 
ఒక్క ఛాన్స్ ఇచ్చిన చిత్రయూనిట్ !!
నిజానికి ఈ పాత్ర కోసం ముందుగా వరలక్ష్మి శరత్ కుమార్ ను అనుకున్నారు. ఇలాంటి నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ పోషించడంలో ఆమెకు మంచి అనుభవం ఉంది. అయితే రీసెంట్ గా నమిత కూడా ఈ సెగ్మెంట్ లో రాణిస్తోంది. అందుకే నమితకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు చిత్ర యూనిట్.

Trending News