Sobhita Dhulipala-Naga Chaitanya: శోభిత ధూళిపాల లవ్ సితార అనే సినిమాలో నటించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను విడుదల చేయగా పెళ్లికి ముందు ఆమె ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది అనే విషయాలను చాలా చక్కగా చూపించారు. మొత్తానికైతే ట్రైలర్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తొంది ఈ అక్కినేని కోడలు.
యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాల త్వరలో అక్కినేని కోడలుగా అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ లోపే ఆమె నటించిన చిత్రాలు విడుదలవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈమె నటించిన లవ్ సితార చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధం అయింది. ఫ్యామిలీ, ఎమోషన్స్, లవ్, మ్యారేజ్ టెన్షన్స్ తో పాటు ఇతర ఎమోషన్స్ తో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ 5, ఓటిటీ ఫ్లే లో విడుదలకు సిద్ధం అయ్యింది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేయగా, ఈ ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తోంది అని చెప్పవచ్చు.
తాజాగా ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. తారా(శోభిత) స్వతంత్ర భావాలు ఉన్న ఆధునిక యువతి. ఆమె ఇంటీరియర్ డిజైనర్ గా తన వృత్తిని కొనసాగిస్తూ ఉంటుంది. చెఫ్ గా పని చేసే అర్జున్ (రాజీవ్ సిద్ధార్థ) అనే యువకుడితో ఆమె పెళ్లి ఖరారు చేస్తారు. పెళ్లి సంబరాలు మొదలైన తర్వాత వారి మధ్య ఒక సమస్య వచ్చి పడుతుంది. ఆ సమస్యను అధిగమించి వీరు పెళ్లి చేసుకున్నారా? లేదా? వీరే ఎంగేజ్మెంట్ బ్రేకప్ అయ్యిందా? అనేది ఈ సినిమా కథ.
పెళ్లి సమయంలో ఏర్పడిన అభిప్రాయ భేదాలు, ఆ సమయంలో జరిగిన మానసిక సంఘర్షణ, ఫ్యామిలీ టెన్షన్, మ్యారేజ్ డ్రామా లాంటి ఎన్నో అంశాలతో కలిపి ఈ సినిమాను రూపొందించినట్టు మనకు ట్రైలర్ చూస్తే స్పష్టం అవుతుంది. ఇందులో నటనకు స్కోప్ ఉన్న పాత్రలోనే శోభిత నటించినట్లు కనిపిస్తోంది.
నటిగా తనకున్న ఇమేజ్ ను మరింత బలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేసిందనే విషయం మనకు ఈ ట్రైలర్లో స్పష్టంగా కనిపిస్తోంది.ఈ సినిమా ట్రైలర్ ను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి ఎక్సైట్ అయింది ఈ ముద్దుగుమ్మ.
ఇకపోతే ఈ సినిమాను కేరళలో షూట్ చేయగా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోంది. కోవిడ్ లాక్ డౌన్ లో ఎవరైనా సమస్యలను అధిగమించి ఈ సినిమా చేశారు. సెన్సిటివ్, స్ట్రాంగ్ ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమా సాంప్రదాయ బంధాల ఆధారంగా నడిచేది మరి ఈ సినిమా తప్పకుండా మెప్పిస్తుంది అంటూ శోభిత చెప్పుకొచ్చింది.