Jr NTR House: ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!

Jr NTR House: ఎన్టీఆర్.. దివంగత ఎన్టీఆర్ మనవడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తాతకు తగ్గ మనవడిగా రాణిస్తున్నాడు. అంతేకాదు ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ లెవల్లో ఫేమస్ అయ్యాడు. అంతేకాదు ఇపుడు డైరెక్ట్ గా బాలీవుడ్ సినిమాలు చేసే రేంజ్ కు ఎదిగాడు. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ. 100 కోట్ల రేంజ్ కు పారితోషికం అందుకునే స్థాయికి చేరుకున్నాడు. త్వరలో దేవరతో పలకరించబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఇల్లు ఎలా ఉంటుందనే ఉత్సుకత అభిమానల్లో ఉంది. ఎక్కడ ఏ స్థాయిలో ఉందో మీరు కూడా ఓ లుక్కేయండి..

1 /7

  Jr NTR House: జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ నందమూరి తారక రామారావు జూనియర్ నందమూరి నట వారసుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ముందుగా  తాత, బాబాయి పేర్లను వాడుకున్నా.. ఆ తర్వాత తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ మొదట్లో ఊర మాస్ హీరోగా మాస్ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు.

2 /7

ఎన్టీఆర్ నట వారసుడిగా అడుగుపెట్టి హీరోగా 23 యేళ్లు కంప్లీట్ చేసుకున్నాడు. అంతేకాదు కెరీర్ మొదట్లో బొద్దుగా ఉన్న ఎన్టీఆర్.. బృందావనం, అదుర్స్ చిత్రాలతో కుటుంబ, మహిళ ప్రేక్షకుల అభిమానాన్ని పొంది అన్ని వర్గాల ప్రేక్షకులు తన సినిమాలు చూసేలా తన ఇమేజ్ ను రీ క్రియేట్ చేసుకున్నాడు.

3 /7

ఇన్నేళ్ల కెరీర్లో సినిమాల పరంగా తన పారితోషికంతో సంపాదించిన  ఆస్తులతో పాటు వారసత్వంగా వచ్చిన కొన్ని ఆస్తులు వచ్చాయి. అందులో హైదరాబాద్ సహా పలు చోట్ల విలువైన ఇల్లు, భూములున్నాయి.

4 /7

హైదరాబాద్ IPS కాలనీ, ప్రశాసన్ నగర్ లో ఎన్టీఆర్ కు పెద్ద ఇళ్లు ఉంది. ఈ ఇల్లు దాదాపు విశాల ఆవరణలో దాదాపు 6 వేల గజాల్లో ఉంది. దీని విలువ దాదాపు రూ. 40 కోట్ల నుంచి రూ. 50 కోట్ల వరకు ఉంటుందనేది సమాచారం. ఇంట్లో విశాలమైన రన్నింగ్ చేసే ల్యాన్, స్విమ్మింగ్ ఫూల్, జిమ్,  సహా ఎన్నో ఎమినీటీస్  ఉన్నాయి.

5 /7

ఈ ఇంటి మెయింటెన్స్ కోసం నెలకు రూ. 7 లక్షల వరకు ఖర్చు అవుతున్నట్టు సమాచారం. ఇంట్లో ఎపుడు 50 మంది వరకు వంట చేస్తారట. హైదరాబాద్ లో షూటింగ్ ఉంటే ఇంటి భోజనాన్ని సెట్స్ కి తీసుకెళ్లి అక్కడ వాళ్లకు పెట్టడం ఎన్టీఆర్ కు అలవాటట.

6 /7

మరోవైపు హైదరాబాద్ లో ఎన్టీఆర్ కు ఇంకో రెండు మూడు ఇళ్లు ఉన్నాయి. అటు బెంగళూరుతో పాటు తాతగారి ఊరైన నిమ్మకూరులో వారసత్వంగా సక్రమించిన ఇళ్లు ఉంది.

7 /7

ఇన్నేళ్ల కెరీర్‌లో తన రెమ్యునరేషన్, వివిధ బ్రాండ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు తారక్‌కు తాత నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తులు, మామ నార్నే శ్రీనివాస్ నుంచి సంక్రమించిన పలు ఆస్తులు అన్ని కలిపితే దాదాపు రూ.1200 కోట్ల  విలువ చేస్తుందనేది సమాచారం.