Heart Attack: ప్రతిరోజు ఈ పండ్లు తింటే గుండెపోటు రమ్మన్నా రాదు!!

Foods To Prevent Heart Attacks: గుండె సంబంధిత సమస్యలతో ప్రస్తుతం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యల కారణంగా తీవ్రమైన జబ్బుల బారిన పడుతున్నారు. అయితే కొన్ని రకాల పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. 

Written by - Shashi Maheshwarapu | Last Updated : Sep 19, 2024, 01:22 AM IST
Heart Attack: ప్రతిరోజు ఈ పండ్లు తింటే గుండెపోటు రమ్మన్నా రాదు!!

Foods To Prevent Heart Attack: గుండెపోటు అనేది ఒక సాధారణ సమస్య. ఈ సమస్య కారణంగా గుండె, కండరాలకు సరిపడా ఆక్సిజన్‌ అందకుండా ఉంటుంది. శరీరానికి సరైన రక్తప్రసరణ చాల ముఖ్యమని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. అయితే గుండె పోటు సమస్యలు తగ్గించుకోవాలంటే కొన్ని రకమైన ఆహారపదార్థాలకు తీసుకోవాల్సి ఉంటుంది. గుండె ఆరోగ్యానికి పండ్లు ఎంతో ఉపయోగపడతాయి. ఇందులో  విటమిన్‌లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.వీటిని ప్రతిరోజు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది.     

అవకాడో ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. ఇది రక్తాన్ని పలచబరుస్తుంది. దీని ఉదయం సలాడ్‌లో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. శరీరానికి ఉసిరి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.  ఇది రక్తంను శుద్ధి చేయడంలో ఎంతో సహాయపడుతుంది. వాల్‌నట్‌లో విటమిన్ ఇ, ఒమేగా - 3 యాసిడ్‌లు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతాయి. బెర్రీలలో సాలిసైలేట్‌ అనే పదార్ధం అధికంగా ఉంటుంది. ఇది రక్తంను పలుచబడటానికి సహాయపడుతుంది. వీటితో పాటు ఆరెంజ్‌, పుచ్చకాయ, యాపిల్‌ ను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 

పండ్లు మాత్రమే కాకుండా కూరగాయలు, తృణధాన్యాలు, మాంసం వంటి ఆహారపదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. కనీసం జాగింగ్‌, సైక్లింగ్‌ వంటి పనులు చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.  మద్యపానం అధికంగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు పెరుగుతాయి. వీటిని మితంగా తీసుకోవడం చాలా మంచిది. బరువు అధికంగా ఉండటం వల్ల కూడా గుండె పోటు సమస్యలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. శరీరానికి తగినంత బరువు ఉండటం మంచిది. తీవ్రమైన ఒత్తిడి, మానసిక సమస్యలు ఉన్నవారు కూడా గుండె పోటు సమస్యల బారిన పడుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. రక్తపోటు, షుగర్‌ లెవెల్స్‌ను కంట్రోల్‌ లో ఉంచడం వల్ల గుండె సమస్యల బారిన పకుండా ఉంటారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం రెగ్యులర్‌గా హెల్త్‌ చెక్‌అప్స్‌ చేసుకోవడం చాలా మంచిది. దీని వల్ల సమస్యను ముందుగానే గుర్తించడం మంచిది.  వైద్యుడు సూచించిన మందులను క్రమం తప్పకుండా తీసుకోవడం.

Disclaimer: ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లు అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Also Read: Orange Seeds: పొరపాటున కూడా ఈ గింజలు పడేయకండి.. దీని వల్ల లాభాలెన్నో..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News