వీడు ఆరడుగుల బుల్లెట్; పవన్ తనయుడి గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టిన హీరో అడివి శేష్‌ !!

వీడు ఆరడుగలు బుల్లెట్..ధైర్యం విసిరిన రాకెట్ ఎవరు అంటే ... టక్కున పవన్ కల్యాన్ పేరు చెప్తారు.. అయితే ఇక్కడ ఆరడుగుల బుల్లెట్ పవన్ కాదు.. ఆయన తనయుడు అకీరా నందన్

Last Updated : Aug 28, 2019, 12:20 AM IST
వీడు ఆరడుగుల బుల్లెట్; పవన్ తనయుడి గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టిన హీరో అడివి శేష్‌ !!

పవన్ కల్యాణ్ - రేణు దేశాయ్ ల కుమారుడు అకీరా నందన్ గురించి ఆసక్తికర విషయాలను బయట పెట్టాడు ''ఎవరు'' హీరో అడివి శేష్‌. ఇంతకీ ఈ హీరో...పవర్ స్టార్ తనయుడి గురించి ఏ చెప్పాడో  డీటైల్ గా తెలుసుకోవాలని ఉందా ? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే మరి..

 ''ఎవరు'' మూవీ హీరో అడివి శేష్‌ నటి, ఫిల్మ్‌మేకర్‌ రేణూ దేశాయ్‌ కుటుంబ సభ్యుల్ని కలిశారు. ఈ సందర్భంగా రేణు దేశాయ్ ఫ్యామిలీతో గడిపిన అనుభవాలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నాడు. ఆ సయయంలో శేష్ కొంత సేపు పవన్ కల్యాణ్ - రేణు దేశాయ్ కుమారుడు అకీరా నందన్ కుమార్తె ఆద్యతో కలిసి కాసేపు ముచ్చటించాడు. 

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్  గురించి మాట్లాడుతూ అకీరా చాలా  హ్యాండ్సమ్‌ కుర్రాడు కుర్రాడని.. గంభీరమైన స్వరంతో 6.4 అడుగుల ఎత్తున్న వ్యక్తి అతడు అని హీరో శేష్ చెప్పుకొచ్చాడు. తమ ఇద్దరి మధ్య  ఎడమ చేతి వాటం కావడం సంతోషంగా ఉందన్న శేష్... తమ ఇద్దరిలో చాలా విషయాలు కామన్‌గా ఉన్నాయని  ట్విట్టర్ వేదికగా వివరించాడు.

 

Trending News