Water Supply: హైదరాబాద్‌వాసులకు బిగ్‌ అలెర్ట్‌.. ఈనెల 24న మంచినీటి సరఫరా బంద్‌..

Water Supply Disrupted In Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో రేపు మంచినీటి సరఫరాలో అంతరాయం కలుగునుంచి. ఈ నేపథ్యంలో ఎల్లుండి సెప్టెంబర్‌ 24 మంగళవారం మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.  ఏ ప్రాంతాల్లో వాటర్ సప్లై బంద్ ఉంటుందో  తెలుసుకుందాం.
 

1 /5

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా మంచినీటి సరఫరా పైపులు డ్యామేజ్‌ అయ్యాయి. వాటి మరమ్మతులు వాటర్‌ బోర్డువారు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. 24వ తేదీ మంగళవారం మరమ్మతుల కారణంగా పలుప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదు.  

2 /5

24 గంటల పాటు మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. సెప్టెంబర్‌ 23వ తేదీ ఉదయం 6 గంటల నుంచి వాటర్‌ లీకేజీ వల్ల పైప్‌లైన్‌ మరమ్మతుల కారణంగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.  

3 /5

ఈ నేపథ్యంలో ప్రశాసన్‌ నగర్, అయ్యప్ప సొసైటీ, జూబ్లీ హిల్స్‌, ఫిల్మ్‌ నగర్‌, తట్టిఖానా, మాదాపూర్‌, కొండాపూర్‌, డయేన్స్‌, గచ్చిబౌలీ (డివిజన్‌ VI, XV, IIII), హకీంపేటలోని కొన్ని ప్రాంతాలు, గోల్గొండ, టోలీచౌకీ, లంగర్‌హౌజ్‌, షేక్‌ పేట ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.  

4 /5

మరోవైపు రానున్న గురువారం కృష్ణ వాటర్‌ పైప్‌లైన్‌ (ఫేజ్ I) లీకేజీ కారణంగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని హైదరాబాద్‌ మెట్రోపాలిటన్ వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజీ బోర్డు (HMWS&SB) వాటర్‌ బోర్డు ఎండీ అశోక్‌ రెడ్డి తెలిపారు.  

5 /5

ఈ నేపథ్యంలో  గురువారం మిర్‌ అలాం, కిషన్‌ బాగ్‌,ఆల్‌ జుబెల్‌ కాలనీ, బాలశెట్టి ఖేట్‌, సంతోష్ నగర్‌, వినయ్ నగర్‌, సైఫాబాద్‌, చంచల్‌గూడ, అస్మాగంధ్‌,యకుత్‌పురా, మాదన్నపేట, మహబూబ్‌ మాన్షన్‌, రియాసత్‌ నగర్‌, అలియాబాద్‌, బొగ్గులకుంట,అఫ్జల్‌గంజ్‌, నారాయణ గూడ అడిక్‌మెట్‌, శివం రోడ్‌, నల్లకుంట, చిలకలూడ, దిల్‌షుక్‌ నగర్‌, బొంగులూరు, మన్నెగూడలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.