PF salary limit: పీఎఫ్ వేతన పరిమితి రూ.15 నుంచి 21 వేలకు పెంపు.. రిటైర్మెంట్ నాటికి రూ.1 కోటి ఫండ్ ఎలాగంటే..?

Epf: ఈపీఎఫ్ వో వేతన పరిమితికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. EPFO కార్పస్‌లో ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి ఉద్యోగుల సహకారం కోసం ప్రస్తుత వేతన పరిమితి రూ.15,000 పెంచే అవకాశం ఉంది.   

Written by - Bhoomi | Last Updated : Sep 21, 2024, 01:21 PM IST
PF salary limit: పీఎఫ్ వేతన పరిమితి రూ.15 నుంచి 21 వేలకు పెంపు.. రిటైర్మెంట్ నాటికి రూ.1 కోటి ఫండ్ ఎలాగంటే..?

EPFO salary limit : ఈపీఎఫ్‌వో వేతన పరిమితి విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న వేతన పరిమితిని రూ.15 వేలు నుంచి  రూ. 21,000కు  పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని ద్వారా మీరు కోటి రూపాయల పీఎఫ్ ఫండ్‌తో రిటైర్ అయ్యే అవకాశం లభిస్తుంది. ఇది ఎలాగో తెలుసుకుందాం. ఎవరైనా ఒక ఉద్యోగి నెలవారీ ఆదాయం రూ. 15,000 లేదా అంతకంటే తక్కువ ఉన్నట్లయితే అప్పుడు ఉద్యోగి, యాజమాన్యం ఇద్దరూ జీతంలో 12 శాతం జమ చేయాలి. కానీ యజమాని చేసిన కాంట్రిబ్యూషన్  రెండు భాగాలుగా విభజించబడింది. అంటే 8.33 శాతం ఎంప్లాయీ పెన్షన్ (EPS)కి, 3.67 శాతం ప్రావిడెంట్ ఫండ్‌ లో జమ అవుతుంది. 

నెల వేతనం రూ.15 వేలు ఉంటే.పీఎఫ్ ఎంత కట్ అవుతుంది: 

ఒక ఉద్యోగి జీతం రూ.15 వేలు అని అనుకుందాం. అందులో నెలకు  పీఎఫ్ కాంట్రిబ్యూషన్  రూ. 1800 ఉంటుంది. మళ్లీ అందులో ప్రావిడెంట్ ఫండ్‌కు యజమాని కంట్రిబ్యూషన్ రూ. 550 ఉంటుంది. ఉద్యోగి  కాంట్రిబ్యూషన్  రూ. 1250 ఉంటుంది.

Also Read: Sahara Refund: సహారా డిపాజిటర్లకు గుడ్ న్యూస్.. ఇకపై మరింత ఎక్కువ రిఫండ్ పొందవచ్చు

మీరు 23 ఏళ్ల వయసులో రూ.15 వేలు వేతనంతో ఉద్యోగంలో జాయిన్ అయ్యారని అనుకుందాం. 35 ఏళ్ల పాటు నిరంతరంగా ఈపీఎఫ్‌వోకు కాంట్రిబ్యూషన్  అందించడం కొనసాగిస్తే, పదవీ విరమణ సమయంలో మీకు మొత్తం రూ.71.55 లక్షలు లభిస్తాయి. అయితే వడ్డీ రేటు 8.25 శాతం చొప్పున చివరి వరకూ కొనసాగినప్పుడు మాత్రమే ఈ మొత్తం లభిస్తుంది. 

నెల వేతనం పరిమితి 21 వేల రూపాయలకు పెంచితే పీఎఫ్ ఎంత కట్ అవుతుంది: 

ప్రభుత్వం నెలవారీ ఆదాయ పరిమితిని 21 వేల నుంచి పెంచితే EPFOకి ఉద్యోగి  కాంట్రిబ్యూషన్  రూ. 2520 అవుతుంది. అయితే EPFOకి యజమాని కాంట్రిబ్యూషన్  రూ. 770 కట్ అవుతుంది. ఉద్యోగి కాంట్రిబ్యూషన్ కింద రూ. 1750 కట్ అవుతుంది.

ఉద్యోగి 35 సంవత్సరాల తర్వాత పదవీ విరమణ సమయంలో కోటి రూపాయల నిధి అందుబాటులోకి వస్తుంది. ఇందులో పెట్టుబడి పెట్టిన మొత్తం రూ.15 లక్షలు అవుతుంది. వడ్డీ రూ.85 లక్షలుగా ఉంటుంది. అయితే వడ్డీ రేటు 8.25 శాతం మాత్రమే ఉన్నప్పుడు ఇది సాధ్యం అవుతుంది. 

విత్ డ్రా లిమిట్ మారింది: 

EPFO విత్ డ్రా లిమిట్ కూడా ప్రస్తుత రూ.50,000 నుంచి .1 లక్షకు పెంచారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మీరు దీన్ని విత్ డ్రా చేయాల్సి ఉంటుంది.

Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు కన్నీళ్లు పెట్టిస్తోన్న బంగారం ధర.. నేడు ఎంత పెరిగిందంటే?  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News