Pitru paksham 2024: పితృపక్షంలో బిడ్డ పుడితే అశుభమా? వారి లక్షణాలు ఎలా ఉంటాయి?

Pitru paksham 2024: పితృపక్షం ప్రతి ఏడాది నిర్వహిస్తారు. బాధ్రపదం ముగియగానే ఈ పక్షం రోజులు ప్రారంభమవుతాయి. ఆశ్వీయుజ మాసంలో ఓ 15 రోజులపాటు పితృపక్షం రోజులు నిర్వహిస్తారు. అయితే, ఈ రోజుల్లో బిడ్డ పుడితే ఏం జరుగుతుంది? వారి లక్షణాలు ఎలా ఉంటాయి? ఆ వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

పితృపక్షం సమయంలో చనిపోయిన మన పూర్వీకులు భూమిపై సంచరిస్తారని నమ్ముతారు. అందుకే ఈ సమయంలో వారికి తర్పణం, పిండ ప్రదానం వంటివి చేస్తారు. పితృదోషంతో బాధపడుతున్నవారికి వంశాభివృద్ధి ఆర్థికంగా ఎదుగుదల ఉండదు.  

2 /5

పితృపక్షంలో దానం చేయడం కూడా ప్రామఖ్యత సంతరించుకుంటుంది. బ్రాహ్మణులకు, గోవుకు, నిరుపేదలకు దానధర్మాలు చేస్తారు. భూమిపైకి ఈ పక్షం రోజుల్లో మన పూర్వీకులు మనల్ని ఆశీర్వదించడానికి వస్తారు. అందుకే తిథిల ప్రకారం తర్పణం వంటివి చేస్తారు.  

3 /5

పితృపక్షంలో ఏవైనా శుభకార్యాలు నిర్వహించడం అశుభం. అందుకే ఈ పక్షంలో సమయంలో ఎలాంటి కార్యాలు చేయరు. ఆ పక్షం రోజులు కొత్త వస్తువులు కొనుగోలు చేయరు. పితరుల ఆత్మ శాంతి కలగాలని పిండ ప్రదానం వంటివి చేస్తారు.   

4 /5

ఈ ఏడాది పితృపక్షం సెప్టెంబర్ 18వ తేదీన ప్రారంభమైంది. ఇది అక్టోబర్‌ 2 మహాలయ అమావాస్య లేదా సర్వపితృ అమావాస్యతో ముగుస్తుంది. అయితే, ఈ పక్షం రోజుల్లో ఎవరికైనా బిడ్డ పుడితే శుభమా? అశుభమా? ఆ బిడ్డ లక్షణాలు ఎలా ఉంటాయి?  

5 /5

పితృపక్షంలో పుట్టిన బిడ్డ పుడితే పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు. వారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఈ సమయంలో పుట్టిన పిల్లలు చాలా తెలివైనవారు. ఆ ఇంట్లోవారికి సుకఃశాంతులు వెల్లివిరుస్తాయి. పితృపక్షంలో పుట్టిన పిల్లలు సృజనాత్మకతతో ఆలోచిస్తారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)