Ind Vs Ban Playing 11: బంగ్లాతో రెండో టెస్టుకు టీమిండియా తుది జట్టు ఇదే.. ఆ ప్లేయర్ ఎంట్రీతో బంగ్లాకు వణుకే..!

IND vs BAN 2nd Test Playing 11: బంగ్లాదేశ్‌పై తొలి టెస్టులో విజయం సాధించిన రోహిత్ సేన.. రెండో టెస్ట్‌లో గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధిస్తే.. టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో అగ్రస్థానం మరింత పదిలమవుతుంది. కాన్పూర్ వేదికగా ఈ నెల 27వ తేదీ నుంచి రెండో, చివరి టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుంది..? బెంచ్‌పై ఉన్నవారిలో కెప్టెన్ రోహిత్ శర్మ ఎవరికి ఛాన్స్ ఇవ్వనున్నాడు..? ఓసారి లుక్కేద్దాం పదండి.

1 /11

తొలి టెస్టులో హిట్‌మ్యాన్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమయ్యాడు. కాన్పూర్‌ టెస్ట్‌తో అయినా ఫామ్‌లోకి వస్తాడేమో చూడాలి.  

2 /11

చెన్నైలో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. రోహిత్‌కు తోడు ఓపెనర్‌గా వస్తాడు.  

3 /11

తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. పంత్‌తో కలిసి జట్టుకు భారీ ఆధిక్యం అందించాడు. నంబర్ 3లో ప్లేస్‌ను ఫిక్స్‌ చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు.  

4 /11

రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్‌ను అందుకోవాల్సి ఉంది. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమయ్యాడు.   

5 /11

తొలి టెస్టుతో రీఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్.. సూపర్ సెంచరీతో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. వికెట్ కీపర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా కార్పూర్‌లో మరోసారి గేమ్‌ ఛేంజర్‌గా మారనున్నాడు.  

6 /11

గాయం తరువాత కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి రావడంతో బ్యాటింగ్ ఆర్డర్‌లో కూర్పు సెట్ అయింది. అయితే గత ఫామ్‌ను అందుకోవాల్సి ఉంది.  

7 /11

రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్ నైపుణ్యంతో మరోసారి సత్తాచాటేందుకు రెడీగా ఉన్నాడు. చెన్నై టెస్టులో బ్యాట్, బంతితో రాణించాడు.   

8 /11

తొలి టెస్టులో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచిన రవిచంద్రన్‌ అశ్విన్‌.. సెంచరీతోపాటు రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. స్పిన్‌కు అనుకూలించే కాన్పూర్‌ పిచ్‌పై మరింత రాణించే అవకాశం ఉంది.  

9 /11

ఇక ఈ మ్యాచ్‌కు తుది జట్టులోకి కుల్దీప్ యాదవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక పేసర్ స్థానంలో తీసుకునే ఛాన్స్ ఉంది.  

10 /11

పేసర్ మహ్మద్ సిరాజ్ పేస్, బౌన్స్‌తో రెండో టెస్టులో కీలకంగా మారనున్నాడు. స్ట్రైక్ బౌలర్‌గా టీమ్‌కు బలంగా మారాడు.  

11 /11

కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకుంటే.. ఆకాష్ దీప్‌ను తప్పించాల్సి ఉంటుంది. అదే టీమ్‌తోనే ఆడాలనుకుంటే ఆకాష్‌ దీప్ తుది జట్టులో ఉంటాడు. పేస్ దళాన్ని బుమ్రా ముందుండి నడిపించనున్నాడు. లేదా బుమ్రాకు విశ్రాంతినిచ్చి కుల్దీప్‌ను ఆడించొచ్చు.