Banana Facts These Persons No To Banana: నిత్యం అందుబాటులో ఉండే చవకగా లభించే పండు అరటి. చవక అని తీసిపారేయకండి యాపిల్ పండు కన్నా అధికంగా ఎన్నో పోషకాలు అరటిపండు కలిగి ఉంటుంది. అయితే అరటి పండు కొన్ని వ్యాధులు ఉన్నవారు మాత్రం అస్సలు తినవద్దు.
అరటి పండు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు అందిస్తోంది. మానవ దేహానికి ఎన్నో పోషకాలను అందిస్తూ ఆరోగ్యంగా ఉంచుతోంది.
అరటి పండులో విటమిన్ బీ6, విటమిన్ సీ, ఫైబర్, పొటాషియం, మాంగనీస్ ఉంటాయి. అంతేకాకుండా గ్లూటాతియోన్, ఫినాలిక్స్, డెల్ఫిడిన్, నరింగిన్ వంటి యాంటీ యాక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. కానీ కొన్ని వ్యాధులతో బాధపడుతున్న వారికి అరటి పండు శత్రువుగా ఉంటుంది.
కిడ్నీ వ్యాధి: అరటిపండ్లను దీర్ఘకాలిక మూత్ర పిండాల వ్యాధులతో బాధపడేవారు తినరాదు. అరటిలో ఉండే అధిక మొత్తంలో పొటాషియం మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది.
జీర్ణ సమస్య: జీర్ణ సమస్యలు ఉంటే అరటి పండును తినవద్దు. అరటిలో ఉండే పీచు పదార్థం ఎక్కువగా తీసుకుంటే కొన్ని రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
అధిక రక్తపోటు: అరటిపండులో ఉండే పొటాషియం బీపీ బాధితులకు చేటు చేస్తుంది. అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు తినకుంటే మంచిది.
మధుమేహం: సహజంగా లభించే చక్కెర అరటిలో అధికంగా ఉంటుంది. అరటి తింటే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. మధుమేహం బాధితులు అరటిపండ్లను తినవద్దు.
అలర్జీ: కొంతమందికి కొన్ని పండ్లు తింటే అలర్జీలు వస్తాయి. కొందరికి అరటి పండు తింటే కూడా అలర్జీ వస్తుంది. అలాంటి వారు తినవద్దు.
సూచన: ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఇచ్చినది. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారానికి జీ మీడియా ఎలాంటి బాధ్యత వహించదు.