Udhayanidhi Stalin: కొత్త ఉప ముఖ్యమంత్రి ఆస్తుల విలువ తెలిస్తే షాక్! తండ్రినే మించాడే

Udhayanidhi Stalin Assets Value: తమిళనాడులో మరో రాజకీయ తరం బయటకు వచ్చింది. తాత.. తండ్రి వారసత్వంగా వచ్చిన ఉదయనిధి స్టాలిన్‌ తండ్రి తర్వాత అంతటి గుర్తింపు పొందుతున్నాడు. తాజాగా ఉప ముఖ్యమంత్రి కావడంతో అతడిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఉదయనిధి ఆస్తులు, సంపద లెక్కలు ఇలా ఉన్నాయి.

1 /8

తాతాతండ్రి వారసత్వం: గొప్ప రాజకీయ కుటుంబం ఉన్నా కూడా మొదట ఉదయనిధి రాజకీయాల్లోకి రాలేదు. సినీ పరిశ్రమలోకి ప్రవేశించి హీరోగా ఉదయనిధి స్టాలిన్‌ గుర్తింపు పొందాడు.

2 /8

సినీ ప్రవేశం: 2012లో ఒరుకల్‌ ఒరు కండి సినిమాతో హీరోగా రంగ ప్రవేశం చేశాడు. అంతకుముందు రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. 

3 /8

సినీ పరిశ్రమలో మొత్తం 11 ఏళ్లు కొనసాగగా.. 15 సినిమాలు చేశాడు. మామన్నన్‌ అతడి చివరి సినిమా.

4 /8

విద్యాభ్యాసం: డాన్‌బాస్కో పాఠశాల నుంచి పాఠశాల విద్యను పూర్తి చేశాడు. అనంతరం చెన్నైలోని లయోలా కళాశాలలో చేరాడు. 1997లో విజువల్‌ కమ్యూనికేషన్‌లో పట్టా పొందాడు.

5 /8

ఎన్నికల్లో విజయం: సినిమాలు చేసుకుంటూనే తమ పార్టీ డీఎంకేలో చేరి యువజన విభాగాన్ని నడిపించాడు. 2021లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాడు. చెపోక్‌ తిరువల్లికేణి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. 

6 /8

కుటుంబం: అతడికి భార్య కురితిగ, పిల్లలు ఇబణితి, తన్మయ ఉన్నారు. ఉదయనిధి స్టాలిన్‌ ఆస్తులు రూ.33 కోట్లు ఉన్నాయి. ఉదయనిధిపై 22 క్రిమినల్‌ కేసులు ఫైలయ్యాయి.

7 /8

డిప్యూటీ సీఎం: తండ్రి ఎంకే స్టాలిన్‌ ముఖ్యమంత్రి అయ్యాక.. ఉదయనిధి క్రీడా, ప్రణాళిక, అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు తాజాగా ఉప ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు.

8 /8

సీఎంగా కూడా: డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఉదయనిధి రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశం కూడా ఉందని చర్చ నడుస్తోంది.