Holidays 2024: మరో బంపర్ ఆఫర్.. రేపు కూడా అన్ని ప్రభుత్వ ఆఫీసులు, బ్యాంకులకు హలీడే.. ఎందుకో తెలుసా..?

Bank holidays 2024: ప్రస్తుతం దసరా పండుగ సీజన్ నడుస్తోంది.ఇప్పటికే అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వాలు సెలవులను ప్రకటించారు.  ఈ క్రమంలోనే రేపు కూడా ఆ స్టేట్ లో బ్యాంకులకు, ప్రభుత్వ కార్యాయలయాలకు సెలవులు ఉన్నట్లు తెలుస్తోంది.

1 /7

దసరా సంబరాలు మొదలయ్యాయి. దేశంలో దసరా పండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు భారీ ఎత్తున హలీడేలు కూడా ప్రకటిస్తుంటాయి.

2 /7

ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు హలీడేలను డిక్లెర్ చేశాయి. అక్టోబరు 3 నుంచి 12 వరకు దసరాల సెలవులను పలు స్టేట్స్ లను ప్రకటించాయి. దీంతో స్కూల్స్,కాలేజీ విద్యార్థులు ఇంటికి వెళ్లిపొయేందుకు రెడీ అయిపోతున్నారు.  

3 /7

ఈ నేపథ్యంలో ఈరోజు (బుధవారం) గాంధీ జయంతి నేపథ్యంలో దేశమంతాట ఇప్పటికే హలీడే ఉన్న విషయం తెలిసిందే. మనదేశానికి ఇండిపెండెన్స్ డే తీసుకుని రావడంలో మహత్మ గాంధీ ఎంతో పాటు పడిన విషయం తెలిసిందే. అందుకే ఆయనను జాతీపిత అంటారు.

4 /7

అదే విధంగా ఈసారి గాంధీ జయంతి నేపథ్యంలో అక్టోబరు 2 తోపాటు, అక్టోబరు 3 కూడా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు కూడా సెలవులు ఉండబోతున్నాయి. ఈ మేరకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సర్కారు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 

5 /7

అక్టోబర్ 3న మహారాజా అగ్రసేన్ జయంతి సందర్భంగా సెలవును ప్రకటించినట్లు తెలుస్తోంది. మహారాజ అగ్రసేన్ జయంతిని.. పంజాబ్ , హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ లలో నిర్వహిస్తారు.

6 /7

ఈ పండుగను వైశ్య కమ్యూనిటీ వారు మతపరమైన భక్తితో జరుపుకుంటారు. అగ్రవాల్, జైన, అగ్రహరి వర్గాలతో సహా మహారాజా అగ్రసేన్ వారసులకు ఇది ఒక పవిత్రమైన రోజుగా చెప్తుంటారు. దేశంలో ఐక్యత, సామరస్యం, సామాజిక సంక్షేమం కోసం ఆయన పాటుపడ్డారని చెబుతుంటారు.

7 /7

అందుకే అగ్రసేన్ ను గుర్తుచేసుకుంటూ ఈరోజు కొన్ని రాష్ట్రాలలో ప్రత్యేకంగా, ప్రార్థనలు, ఊరేగింపులు, సమాజ సమావేశాలతో పండుగను జరుపుకుంటారు . అందుకే ఈరోజున బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు భగవంత్ మాన్ సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది.