మూడు లక్షల కోట్లు దాటిన ఏపీ అప్పులు !!

Last Updated : Oct 2, 2019, 01:51 PM IST
మూడు లక్షల కోట్లు దాటిన ఏపీ అప్పులు !!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై గణాంకాలను విడుదల చేసింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అప్పులు 2020 మార్చి నాటికి రూ. 3.41 లక్షల కోట్లకు చేరనున్నట్లు పేర్కొంది . ఈ అప్పుడు మన వార్షిక బడ్జెట్ కంటే రెట్టింపుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే  ఏపీ  ఏటా సగటున రూ. 17 వేల కోట్ల అప్పులను చెల్లించాల్సి ఉంది. ఇలా రానున్న ఐదేళ్లలో రూ. 89,994 కోట్లను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. తాజాగా ఆర్ధిక పరిస్థితిని గాడి పెట్టాలంటే ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కోత విధించక తప్పదని  నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి మన ఈ ఆర్ధిక స్థితిని ముఖ్యమంత్రి జగన్ ఏ మేరకు అధిగమిస్తారనేది చూడాల్సి ఉంది.
 

Trending News