Navaratri 2024: నవరాత్రుల్లో ఆయుధ పూజ ఎప్పుడు..?.. విశిష్టత, దీని వెనుక ఉన్న ఈ రహాస్యం తెలుసా..?

Dussehra celebrations 2024: దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా  ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దసరా ఉత్సవాల వేళ తొమ్మిది రోజులపాటు అమ్మవారికి ఎంతో భక్తితో కొలుచుకుంటారు.

1 /8

అశ్వయుజ మాసంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే దేశ వ్యాప్తంగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి.  తొమ్మిది రోజుల పాటు, తొమ్మిది అవతారాలలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.  

2 /8

చెడుపై మంచి గెలిచిన దానికి గుర్తుగా దసరాను అనాదీగా జరుపుకుంటాం. దసరా రోజున శ్రీరాముడు, రావణుడ్నిసంహారించాడని చెబుతుంటారు.అదే విధంగా దుర్గా అమ్మవారు.. మహిషా సురుడిని సైతం ఇదే రోజున సంహారించారనిచెబుతుంటారు. పాండవులకు ఇదే రోజున తమ రాజ్యం తిరిగి లభిస్తుందంట. అందుకే ఈ రోజున అత్యంత మంచిదని చెబుతుంటారు.

3 /8

దసరా నవరాత్రులు మన దేశంలోనే కాకుండా.. చాలా చోట్ల ఎంతో భక్తితో జరుపుకుంటారు. అయితే.. అక్టోబర్ 3 న ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు, 12వరకు కొనసాగనున్నాయి. ఈరోజుల్లో అమ్మవారిని భక్తితో కొలుచుకుంటారు. అయితే.. ఈసారి నవమి , దశమి ఒకే రోజున వచ్చినట్లు తెలుస్తోంది.

4 /8

అనాదీగా నవమి రోజున ఆయుధ పూజను జరుపుకుంటాం. రావణాసురుడ్రి సంహారించడానికి ముందు శ్రీరాముడు సైతం ఆయుధ పూజ చేశారంట. అదే విధంగా పాండవులు సైతం.. ఈరోజున తమ ఆయుధాలకు పూజలు చేసిన తర్వాత యుద్దానికి వెళ్లారంట.అందుకు అనాదీగా ఈరోజు ఆయుధ పూజలు పాటిస్తు వస్తున్నారు.

5 /8

ఇదిలా ఉండగా.. ఎవరు ఏ రంగానికి చెందిన వారైన కూడా.. వారికి ఉద్యోగం లేదా ఉపాధి కల్పిస్తున్న రంగంలో వారు ఉపయోగించే వాటిని ఆయుధ పూజ నిర్వహిస్తారు. కుమ్మరి వారు కుండలు తయారుచేసే చక్రాన్ని, కమ్మరి వారు పనిముట్లను, పోలీసులు గన్ లు, లాఠీలను, ప్రజలు వాహానాలు, బైక్ లకు వాహాన పూజలు చేస్తుంటారు.

6 /8

టెకీ ఉద్యోగులు.. కంప్యూటర్ లను, ల్యాప్ టాప్ లను  కూడా తమ ఆయుధంగా భావించి పూజించుకుంటారు.  మీడియా రంగంలో ఆయా కంపెనీల లోగోలను ఆయుధాలుగా భావించి పూజిస్తుంటారు. డాక్టర్లు స్టెతస్కోప్ లను, సర్జికల్ పరికరాలను పూజిస్తారు.

7 /8

చాలా మంది ఈరోజు కార్లు, బైక్ లను కూడా పూజిస్తుంటారు.  మెయిన్ గా దసరా నవరాత్రులలో.. నవమి రోజున ఆయుధ పూజలు చేసి, దుర్గాపూజలు నిర్వహిస్తుంటారు.  ఈసారి అక్టోబరు 12 న నవమి, దశమి ఉత్సవాలు నిర్వహించనున్నారు.   ఈ క్రమంలో కొంత మంది తమ షాపులలో ఈ రోజు వారికి ఉపాధిని అందించే వాటిని ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు.ఈ రోజున పూజలు చేస్తే.. లక్ కలిసి వస్తుందని చాలా మంది భావిస్తుంటారు.

8 /8

దసరా నవరాత్రులలో ఏంచేసిన కూడా కలసి వస్తుందని చెబుతుంటారు. తొమ్మిదిరోజులు, తొమ్మిది నైవేద్యాలను ఎంతో భక్తితో సమర్పించుకుంటారు. అదే విధంగా దసరా రోజున రాత్రిపూట చాలా ప్రాంతాలలో రాముడు  రావణుడ్ని సంహారం కార్యక్రమం చేస్తుంటారు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)