Bathukamma Kanuka: బతుకమ్మ కానుకకు మంగళం? చీరలు లేవు, రూ. 500 ఊసే లేదు..!

Bathukamma Kanuka 2024: తెలంగాణలో బతుకమ్మ అంటే అత్యంత వైభవంగా నిర్వహించుకునే రాష్ట్ర పండుగ. ఈ పండుగకు ఆడ బిడ్డలంతా ఒక్క దగ్గరకు చేరుకుని రంగురంగు పూలతో బతుకమ్మ పాటలు పాడుతూ నిర్వహించుకుంటారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి బతుకమ్మ చీరలు మహిళలకు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఇంకా ఆ ఊసే లేదు.
 

1 /5

బతుకమ్మ పండుగ అక్టోబర్‌ 3వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఈ పండుగ 10వ తేదీ సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. అయితే, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బతుకమ్మ సంద్భంగా ఆడబిడ్డలందరికీ చీరలు కానుకుగా పంపిణీ చేశారు.  

2 /5

ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంది. ఆ మధ్య చీరలకు ఇప్పటికే ఆర్డర్ ఇచ్చారు అన్నారు. చీరలు కాదు.. రూ.500 ఇస్తారు ప్రతి మహిళకు రేషన్‌ కార్డు ఆధారంగా పంపిణీ చేస్తారు అని ప్రచారం జరిగింది. దీంతో మహిళలు అంతా ఆనందపడ్డారు. అయితే, సద్దుల బతుకమ్మ కూడా దగ్గరకు వస్తుంది కానీ ఇప్పటి వరకు బతుకమ్మ పండుగ కానుక ఊసే లేదు.  

3 /5

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదికే బతుకమ్మ కానుకకు మంగళం పాడిందా? అని అందరిలో అనుమానం మొదలైంది. దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కూడా లేకపోవడంతో మహిళలంతా ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూపులు చూస్తున్నారు.  

4 /5

రూ.500 కాదు కనీసం ప్రతి ఏడాది బతుకమ్మ కానుకగా పంపిణీ చేసే చీరల ఊసు కూడా లేకపోవడంతో ఆ అనుమానం అందరిలో తలెత్తింది. ఒకవైపు హైడ్రా, మరోవైపు కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలతో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం నుంచి బతుకమ్మ కానుకపై ఇప్పటి వరకు అధికారింగా ఎలాంటి ప్రకటన చేయలేదు.  

5 /5

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆడబిడ్డలందరికీ రాష్ట్ర పండుగ బతుకమ్మ కానుకగా చీరలు రేషన్‌ షాపుల ఆధ్వర్యంలో పంపిణీ చేసేవారు. అప్పటి నుంచే పండుగ వాతావరణం కూడా మొదలయ్యేది. కానీ, ప్రభుత్వం ఇప్పటి వరకు బతుకమ్మ కానుకపై ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ఈసారి బతుకమ్మ కానుకు ఉండదేమో అని ప్రజలు అనుకుంటున్నారు.