Vijayadashami Horoscope: దేవీ నవరాత్రుల వేళ ఈ 6 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

Dussehra 2024:  అక్టోబర్ మూడవ తేదీ నుండి దేవీ నవరాత్రులు ప్రారంభమైన విషయం తెలిసిందే. నిన్న బాల త్రిపుర దేవి గా అవతరించిన అమ్మవారు,  నేడు గాయత్రీ దేవి అవతారం ఎత్తారు. ఇదిలా ఉండగా ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా కొన్ని రాశుల వారికి అధికారం,  ధన యోగాలు పట్టబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.  మరి ఆ ఆరు రాశుల వారు ఎవరో ఇప్పుడు చూద్దాం. 
 

1 /7

దేవీ నవరాత్రులు.. దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.  ముఖ్యంగా ఈ నవరాత్రులలో అమ్మవారు ఒక్కో రూపాన్ని దాల్చుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకించి కొన్ని రాశుల వారికి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని, ఆ అమ్మవారి కృపాకటాక్షం కారణంగా ఈ రాశుల వారికి ధన , ధాన్య , సంతానయోగం కలగబోతోందని పండితులు చెబుతున్నారు.

2 /7

వృషభం.. ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు , తన స్వక్షేత్రమైన తులా రాశిలో సంచారం చేస్తున్న కారణంగా కుటుంబంలో సుఖసంతోషాలకు కొరత ఉండదు. ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి.. శుభవార్తలు వింటారు. ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది 

3 /7

మిధునం.. ఈ రాశి అధిపతి బుధుడు స్వక్షేత్రంలోనే కాక వచ్చే స్థితిలో కూడా ఉండడంతో పాటు శని,  శుక్రులు కూడా అనుకూలంగా ఉన్న నేపథ్యంలో విజయాలు సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు పెరిగి పలుకుబడి పెరుగుతుంది.  మనసులోని కోరికలు నెరవేరుతాయి. 

4 /7

కన్యారాశి.. కన్య రాశికి అధిపతి అయిన బుధుడు ఇదే రాశుల ఉండడం వల్ల ధనస్థానంలో ధనాధిపతి  శుక్రుడు సంచారం చేస్తున్నందువల్ల ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంటుంది . ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడమే కాదు జీతం కూడా పెరుగుతుంది.  ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు.

5 /7

తులారాశి.. తులారాశి వారికి శుక్రుడు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల మహాభాగ్యం పట్టుకోబోతోందని సమాచారం.  అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో హోదాలు పెరుగుతాయి. ఉద్యోగులకు విదేశీ అవకాశాలు అంది వస్తాయి.

6 /7

మకర రాశి.. ఈ రాశి వారికి శని ధనస్థానంలో ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగ , పెళ్లి ప్రయత్నాలకు ఊహించని స్పందన లభిస్తుంది. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి.   

7 /7

కుంభరాశి.. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ఉద్యోగంలో త్వరగా పురోగతి లభిస్తుంది.ఉద్యోగ,  పెళ్లి ప్రయత్నాలు విదేశీ అవకాశాలు లభిస్తాయి. వృత్తి , ఉద్యోగాల రీత్యా విదేశీ ప్రయాణాలు చేయవలసి వస్తుంది.