PM Internship Scheme: మీకు నచ్చిన కార్పోరేట్ కంపెనీలో పనిచేయాలని ఉందా? అయితే పీఎం ఇంటర్న్ షిప్ స్కీం ద్వారా ఇలా అప్లై చేయండి

PM Internship Scheme Apply: ఐదేండల్లో కోటి మంది యువతకు ఉపాధి నైపుణ్యాలు అందించే లక్ష్యంతో పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్ కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ. 800కోట్ల వ్యయంతో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 12 నుంచి 25 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు షురూ కానున్నాయి. మీకు నచ్చిన కంపెనీల్లో ఉద్యోగం కావాలంటే..పీఎం ఇంటర్నర్ షిప్ స్కీం ద్వారా ఎలా అప్లయ్ చేసుకోవాలో చూద్దాం. 
 

1 /6

PM Internship Scheme Apply: ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం  అధికారిక వెబ్‌సైట్ pminternship.mca.gov.in. ఈ పథకం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద రన్ అవుతోంది. మీరు ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ అర్హతలకు సంబంధించిన వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.  అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అక్టోబర్ 12నుంచి ప్రారంభం అవుతుంది. కానీ దరఖాస్తు చేయడానికి ముందు ఎలాంటి అర్హతలు ఉండాలో తెలుసుకుందాం.   

2 /6

PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ అర్హత: పీఎం ఇంటర్న్ షిప్ ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులు 21 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ యువకులు, ఎక్కడా ఫుల్ టైం ఉద్యోగం చేయని,  విద్యా కోర్సులో చదవని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు డిస్టెన్స్ లో  చదివిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.   హైస్కూల్,అంతకంటే తక్కువ చదువుకున్న  ITI సర్టిఫికేట్, పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా ఉన్నవారు లేదా BA, B.Sc, B.Com, BCA, BBA, B.Pharma వంటి కోర్సులు చేస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.2023-24 ఆర్థిక సంవత్సరంలో వారి తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామి వార్షిక ఆదాయం రూ. 8 లక్షలకు మించని యువత మాత్రమే ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.   

3 /6

వీరికి అర్హత లేదు:  IIT, IIM, నేషనల్ లా యూనివర్సిటీ, IISER, NID, IIIT నుండి డిగ్రీలు పొందిన యువత దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు కాదు. CA, CMA, CS, MBBS, BDS, MBA లేదా ఏదైనా మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదివిన వారు కూడా దరఖాస్తు చేయలేరు. అంతేకాదు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల పథకాల కింద ఏదైనా నైపుణ్యం, అప్రెంటిస్‌షిప్, ఇంటర్న్‌షిప్ లేదా విద్యార్థి శిక్షణా కార్యక్రమంలో భాగమైన వారు కూడా ఈ పథకానికి అర్హులు కాదు.నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లేదా నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ కింద ఎప్పుడైనా అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన లేదా పొందుతున్న వ్యక్తులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లేదు.   

4 /6

ఎలాంటి ఫిర్యాదు వచ్చినా పరిష్కరించేందుకు కంపెనీ స్థాయిలో ఏర్పాట్లు ఉంటాయని, కంపెనీల స్థాయిని మంత్రిత్వ శాఖ బృందం పరిశీలిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తద్వారా సమస్యలను సకాలంలో పరిష్కరించవచ్చు. ఇది కాకుండా, టోల్ ఫ్రీ నంబర్ 1800-116-090 కూడా ప్రారంభించారు. దానిపై వివిధ భాషలలో సేవలు అందిస్తుంది.   

5 /6

పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పుడు కొన్ని కాల్ సెంటర్‌లను కూడా ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హిందీ, ఇంగ్లీషుతో పాటు, ఆసక్తిగల అభ్యర్థుల ప్రశ్నలకు ఒడియా, గుజరాతీ, అస్సామీ, మరాఠీ, మలయాళం, తెలుగు, కన్నడ, బెంగాలీ భాషలలో సమాధానాలు లభిస్తాయి.  

6 /6

 ప్రస్తుతం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, తెలంగాణ, గుజరాత్‌లలో గురువారం మధ్యాహ్నం వరకు ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది.  కాల్ చేసిన వారిలో 44% గ్రాడ్యుయేట్, 13% పోస్ట్ గ్రాడ్యుయేట్, 3% 12th పాస్, 3% 10th పాస్, 1% 8th పాస్, 20% ఇతర అర్హతలు కలిగి ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.