Pension Scheme: కేంద్ర ప్రభుత్వ అదిరిపోయే గిఫ్ట్‌.. ఈ పథకం ద్వారా భార్యాభర్తలకు నెలకు రూ.10,000 పెన్షన్‌..!

Atal Pension Yojana benefits: వయస్సు మీదబడిన తర్వాత ఒకరి పై ఆధారపడకుండా నెలనెలా పింఛను వస్తే బాగుంటు అనుకుంటారు. అయితే, ప్రభుత్వ ఉద్యోగులను పక్కన పెడితే సామాన్య వృద్ధుల పరిస్థితి ఏంటి? అటువంటి వారికోసం కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గిఫ్ట్‌ తీసుకువచ్చింది. అదే అటల్‌ పెన్షన్‌ యోజన. ఈ పథకం ద్వారా ప్రతినెలా పెన్షన్‌ పొందవచ్చు. అంతేకాదు ఈ పథకంలో భార్యాభర్తలు ఇద్దరూ ప్రతి నెలా అటల్ పెన్షన్‌ యోజన ద్వారా రూ.10 వేలు పొందవచ్చు.
 

1 /8

సామాన్య వృద్ధులకు ఈ పథకం ద్వారా వయస్సు మీరిన తర్వాత ప్రతినెలా పెన్షన్‌ పొందవచ్చు. ఈ పథకం 2015 లో ప్రారంభించారు. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి, సురక్ష యోజన కూడా అప్పుడే ప్రారంభించారు.  

2 /8

అటల్‌ పెన్షన్‌ ద్వారా పదవీవిరమణ తర్వాత ప్రతినెలా పెన్షన్‌ పొందవచ్చు. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు, భారతీయులైన ఎవరైనా ఈ స్కీమ్‌ కింద తమ పేరును నమోదు చేసుకోవాలి.  

3 /8

60 ఏళ్లు వయస్సు దాటినప్పటి నుంచి ఈ పథకం కింద నెలకు రూ.1000 నుంచి రూ.5000 పింఛను పొందవచ్చు. 2022 వరకు ఈ స్కీమ్‌లో 64 లక్షల మంది చేరారు. ఇప్పటి వరకు వీరి సంఖ్య నాలుగు కోట్లకు పెరిగింది.  

4 /8

ఒకవేళ ఈ స్కీములో భార్యాభర్తలు ఇద్దరూ చేరితే వారికి రూ.5000 చొప్పున పింఛను పొందవచ్చు. అంటే భార్యాభర్తలు ఇద్దరూ అటల్‌ పెన్షన్ యోజన ద్వారా 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.10,000 పొందవచ్చు.  

5 /8

ఎంత త్వరగా ఈ పథకంలో చేరి డబ్బును ఆదా చేసుకుంటే అంత ఎక్కువగా పెన్షన్‌ అందుకోవచ్చు. ప్రతి నెలా రూ.5000 అయితే, ఏడాదికి రూ.60,000 పొందవచ్చు.  

6 /8

మొదట రూ.210 కంట్రిబ్యూట్‌ చేయాలి. వయస్సు పెరుగుతున్నా కొద్దీ అమౌంట్‌ కూడా పెరుగుతుంది. అంటే మొత్తానికి ఈ పథకం కింద కనీసం 20 ఏళ్లు కాంట్రిబ్యూట్‌ చేయాల్సి ఉంటుంది. నెల, మూడు నెలలు, ఆరునెలలు ఇలా కాంట్రిబ్యూట్ చేసే సౌలభ్యం కలదు.  

7 /8

అన్ని నేషనల్ బ్యాంకులు అటల్‌ పెన్షన్‌ యోజనను అందిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో లేదా నేరుగా బ్యాంక్‌ వెళ్లి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. క్వార్టర్లీ రూ.626, ఆరునెలలకు రూ.1239 కాంట్రిబ్యూట్‌ చేయాల్సి ఉంటుంది.  

8 /8

నామినీకి ఏకమొత్తంలో రూ.8,50,000 పొందవచ్చు. ప్రభుత్వం కస్టమర్ల పెట్టుబడికి 50 శాతం లేదా ఏడాదికి రూ.1000 ఏది తక్కువ ఉంటే అంత మొత్తం కాంట్రిబ్యూట్‌ చేస్తుంది.