Nadal Retire: ఎర్రమట్టి రారాజు రఫెల్‌ నాదల్‌ సంచలనం.. టెన్నీస్‌ బ్యాట్‌కు బై బై

Rafael Nadal Emotional Video Goes Viral: ప్రపంచ ప్రసిద్ధి పొందిన టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్ ఆటకు వీడ్కోలు పలికాడు. టెన్నీస్‌ బ్యాట్‌కు బై బై ప్రకటించేశాడు. వచ్చే నెలలో తాను ఆట నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి కలకలం రేపాడు. నాదల్‌ రికార్డులు, ఆటతనం తెలుసుకుందాం.

1 /9

ఫ్రెంచ్ ఆటగాడు: స్పెయిన్‌కు చెందిన రఫెల్‌ నాదల్‌ టెన్నీస్‌ ఆటకు ఎంతో కీర్తి తీసుకువచ్చాడు.

2 /9

విస్మయం: 22 గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీలు అందుకున్న నాదల్‌ అకస్మాత్తుగా ఆటకు వీడ్కోలు పలకడం అందరిని విస్మయపరిచింది.

3 /9

'ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్నా. రెండేళ్లు కఠినంగా గడిచాయి. ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పట్టింది. కానీ ప్రతి దానికి ప్రారంభం ముగింపు ఉంటాయి. వచ్చే నెలలో జరిగే డేవిస్కప్ చివరి మ్యాచ్' అని నాదల్‌ ప్రకటించి అభిమానులకు షాక్‌కు గురి చేశాడు.

4 /9

నలభైకి చేరువ: 38 ఏళ్ల వయసులో నాదల్ వీడ్కోలు పలుకగా టెన్నీస్‌లో మాత్రం అతడి రికార్డులు చెరిపేయలేనివిగా ఉన్నాయి.

5 /9

రికార్డు విజయాలు: తన కెరీర్‌లో ఇప్పటి వరకు 22 గ్రాండ్ స్లామ్, 14 ఫ్రెంచ్ ఓపెన్, 4 యూఎస్ ఓపెన్, 2 వింబుల్డన్ టైటిళ్లు రఫెల్ నాదల్ సాధించారు.

6 /9

రెండు దశాబ్దాలు: 2004లో ప్రొఫెషనల్‌ టెన్నీస్‌ ఆటగాడిగా అరంగేట్రం చేసిన నాదల్‌ క్లే కోర్టు రారాజుగా ప్రపంచ ఖ్యాతి పొంది 2024 దాకా ఆడాడు.

7 /9

వరుసగా విఫలం: కొంత కాలంగా గాయాలతో సతమతమవుతున్న నాదల్‌ ఇటీవల జరిగిన పారిస్‌ ఒలింపిక్స్‌ సత్తా చాటలేకపోయాడు. గత నెలలో జరిగిన లేవర్‌ కప్‌ నుంచి కూడా వైదొలిగాడు.

8 /9

కోల్పోతున్న పట్టు: వయసు మీద పడడం.. ఆడే సామర్థ్యం లేకపోవడంతో గౌరవంగా ఆట నుంచి వైదొలిగారు.

9 /9

అన్నింటా ఆదర్శం: ఆటలోనూ.. అతడి జీవితం కూడా అందరికీ ఆదర్శప్రాయం. కొన్ని వివాదాలు ఉన్నా కూడా అతడి ఆట ముందు కనిపించవు.