నాగార్జున సాగర్‌‌లో 12 గేట్లు ఎత్తివేత.. పెరిగిన యాత్రికుల రద్దీ

నాగార్జున సాగర్‌‌లో 12 గేట్లు ఎత్తివేత.. పెరిగిన యాత్రికుల రద్దీ

Last Updated : Oct 23, 2019, 03:03 PM IST
నాగార్జున సాగర్‌‌లో 12 గేట్లు ఎత్తివేత.. పెరిగిన యాత్రికుల రద్దీ

నల్గొండ: ఇటీవల కురిసిన వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు పూర్తిగా నిండిన నీటితో కళకళలాడుతున్నాయి. ఇప్పటికే శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ఇంతకుముందెప్పుడూ లేనివిధంగా నిండుకుండలా మారగా తాజాగా నాగార్జునసాగర్ రిజర్వాయర్‌‌కు సైతం వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యగా 12 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 2.24లక్షల క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్‌లో గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతుండటంతో ఆ సుందర దృశ్యాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో యాత్రికులు అక్కడకు తరలివస్తున్నారు. 

శ్రీశైలం రిజర్వాయర్‌లో ఇన్‌ఫ్లో 4.48లక్షలు కాగా.. ఔట్‌ఫ్లో 2.64లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలంలో అధికారులు 7 గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. మరోవైపు ఎల్లంపల్లి ప్రాజెక్టులోనూ నీరు నిండు కుండను తలపిస్తోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి సామర్థ్యం 19.8420 టీఎంసీల వద్ద కొనసాగుతోంది. ఎల్లంపల్లి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 82వేల క్యూసెక్కులుగా ఉంది.

Trending News