Encounter Specialist Daya: ఎవరీ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ ? సిద్దిఖీ కేసులో దర్యాప్తు వేగవంతం..87 ఎన్ కౌంటర్లు చేసిన ఇన్‌స్పెక్టర్..

Who Is Encounter Specialist Dayanayak: మాజీ మంత్రి, ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ హత్య నిన్న రాత్రి జరిగింది. ఆగంతకులు అతనిపై రెక్కీ వేసి నిన్న శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో సిద్ధిఖీ కొడుకు ఆఫీసు బయట కాల్చి చంపారు. ఈ ఘటన ప్రస్తుతం సంచలనం రేపుతోంది. అయితే, ఈ కేసుకు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు లింక్‌ ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసును ఛేదించడానికి ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ దయా నాయక్‌కు అప్పగించారు. ఇంతకీ ఈ దయా నాయక్‌ ఎవరు? ఇప్పటి వరకు దాదాపు 87 ఎన్‌కౌంటర్‌లు చేసిన పోలీసు ఇన్‌స్పెక్టర్‌.
 

1 /7

ఈ ముంబై పోలీసు ఇన్‌స్పెక్టర్‌ పేరు వింటనే కరుడుగట్టిన నేరస్థుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. అదేదో సినిమాలో నా పేరు దయా.. నాకు లేనిదే అది అన్నట్లు ఈ దయ కూడా ఇప్పటి వరకు దాదాపు 87 ఎన్‌కౌంటర్లు చేశాడు. దాదాపు 300 మంది వరకు కరుడుగట్టిన నేరగాళ్లను అరెస్టు చేశారు.  

2 /7

1995లో పోలీసు ఉద్యోగంలో చేరారు దయా. గ్యాంగ్‌ స్టార్‌ ఛోటా రాజన్‌లోని ఇద్దరు అనుచరులను కూడా పక్కా సమాచారంతో రౌండప్ చేసి మరి హతమార్చాడు. ఇక్కడి నుంచి దయా ఎన్‌కౌంటర్‌ స్టోరీ మొదలైంది. ఆ సమయంలో ఎక్కడ డిపార్ట్‌మెంట్‌ తనను ఉద్యోగంలో నుంచి తొలగిస్తుందేమోనని భయ పడ్డాడు కూడా.  

3 /7

అంతేకాదు దయా 1999-2003 ఛోటా రాజన్‌ ముఠాను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించాడు. వారి ముఠాను అంతం చేసే వరకు వదలలేదు. ఆ సమయంలో తీవ్ర వివాదాలు కూడా ఆయన్ను చుట్టుముట్టాయి.   

4 /7

అయితే, దయా పై ఓ ఆరోపణ కూడా ఉంది. ఆయన ప్రారంభించిన ఓ స్కూలుకు దావూద్‌ డబ్బులు ఇచ్చాడు అని.. దీనికి కోర్టు అతడిపై ఎంసీఓసీఏ కేసు నమోదు చేసింది. కాగా, ఆ తర్వాత దయా నిర్దోషి అని తేలింది. ఆ తర్వాత ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కేసులో కూడా దయా నిర్ధోషి అని తేలింది.  

5 /7

ఇదిలా ఉండగా మొన్న సల్మాన్‌ ఖాన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కూడా ఇద్దరు నిందితులను కేవలం 24 గంటల్లో పట్టుకున్నాడు ఈ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌. అతనిపై ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ కేసు కూడా నమోదు అయిందని ఆ మధ్య కాలంలో ఆరోపణలు వినిపించాయి.  

6 /7

అయితే, ఈ దయా నాయక్‌ పేరుపై ఎన్నో బాలీవుడ్‌ సినిమాలు తీశారు. డిపార్ట్‌మెంట్‌, కగార్‌, రిస్క్, ఛప్పన్‌, ఆన్‌.. మ్యాన్ ఎట్‌ వర్క్‌ వంటి దాదాపు 20 వరకు హిందీ సినిమాలు తీశారు. అంతేందుకు ప్రముఖ టెలివిజన్‌ సీరియల్‌ సీఐడీలోని దయా క్యారెక్టర్‌ కూడా ఈయన స్పూర్తితోనే సాగింది. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా ఇప్పటి వరకు దాదాపు 87 ఎన్‌కౌంటర్‌లు నిర్వహించారు.  

7 /7

ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ అయిన దయను ఇప్పటికే ఎన్నో సార్లు బదిలీ కూడా చేశారు. ప్రస్తుతం బాబా సిద్ధికి కేసును దయకు అప్పగించారు.ఈయన దర్యాప్తు వేగవంతం చేశారు. శనివారం రాత్రి హత్య జరిగిన సమయంలోనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఇంటరాగేషన్‌ కూడా ప్రారంభించారు.