Nara Rohit Engagement Pics: ఘనంగా నారా రోహిత్ నిశ్చితార్థం.. పెళ్లి ముహూర్తం కూడా పిక్స్..!

Nara Rohit Engagement: నారా వారి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఈరోజు ఘనంగా నారా రోహిత్ నిశ్చితార్థం.. ప్రతినిధి 2 హీరోయిన్ తో జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ.. అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే వీరిద్దరి పెళ్లికూడా ఉండబోతోంది. కాగా వీరిద్దరి నిశ్చితార్థం.. చంద్రబాబు నాయుడు, కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది. 
 

1 /5

ప్రతినిధి -2 సినిమాలో హీరోయిన్ గా నటించిన సిరి లెల్ల తో నారా రోహిత్ ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు.  గత కొద్దిరోజులుగా వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు రాగా ఎట్టకేలకు ఈ జంట నిశ్చితార్థంతో పెళ్లికి తొలి అడుగు వేశారు. 

2 /5

ఆదివారం ఉదయం హైదరాబాదులో జరిగిన ఈ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన భార్య భువనేశ్వరి తో పాటు ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు.   

3 /5

కాబోయే నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 

4 /5

ఇకపోతే వీరి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.  డిసెంబర్ 15వ తేదీన వీరి వివాహం హైదరాబాదులోనే ఘనంగా నిర్వహించబోతున్నట్లు సమాచారం. నారా రోహిత్ విషయానికి వస్తే.. 2011లో విడుదలైన సోలో సినిమాతో తొలి విజయాన్ని అందుకున్నారు.  ఆ తర్వాత ఒక్కడినే ,అసుర , జో అచ్యుతానంద, రౌడీ ఫెలో, ప్రతినిధి వంటి చిత్రాలు చేశారు. 2018లో విడుదలైన వీర భోగ వసంతరాయలు సినిమా తర్వాత ఆరేళ్ళు ఇండస్ట్రీకి దూరమయ్యారు. 

5 /5

ఇక ఇప్పుడు మళ్లీ ప్రతినిధి 2 సినిమాతో మంచి విజయాన్ని అందుకొని ఇదే సినిమాలో హీరోయిన్గా నటించిన సిరితో పరిచయం ఏర్పడి, అది కాస్త పెద్దలు అంగీకారంతో పెళ్ళికి దారితీసింది.