Beetroot Vada: బీట్‌రూట్ వడల రెసిపీ.. ఇలా తింటే బోలెడు లాభాలు..!

Beetroot Vada Recipe: బీట్‌రూట్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం. బీట్‌ రూట్‌ నచ్చని వారు దీంతో రుచికరమైన వంటలను తయారు చేసుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుంది. 

Written by - Shashi Maheshwarapu | Last Updated : Oct 15, 2024, 02:46 PM IST
Beetroot Vada: బీట్‌రూట్ వడల రెసిపీ.. ఇలా తింటే బోలెడు లాభాలు..!

Beetroot Vada Recipe: బీట్‌రూట్‌ ఆరోగ్యకరమైన కూరగాయ. దీని రంగుకు చూసి చాలా మంది తినడానికి ఇష్టపడరు. కానీ ఇందులో పోషకరమైన విటమిన్‌లు, మినరల్స్‌, ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. బీట్‌రూట్‌తో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే బీట్‌రూట్‌ నచ్చనివారు బీట్ రూట్‌తో వడలు తయారు చేసుకొని తింటే ఎంతో మంచిది. దీని తయారు చేసుకోవడం ఎంతో సింపుల్‌ .  దీని కావాల్సిన పదార్థాలు ఏంటో మనం తెలుసుకుందాం. 

బీట్‌రూట్ వడ ఆరోగ్యలాభాలు:

బీట్‌రూట్‌ వడలు రుచికరమైనవి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో కీలక ప్రాత పోషిస్తాయి. ఇందులో ఉండే నైట్రేట్‌లను కలిగి ఉంటాయి, ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతాయి. నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలను విశాలపరుస్తుంది, రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. 

బీట్‌రూట్‌లో కార్బోహైడ్రేట్‌లు, ఫైబర్‌తో నిండి ఉంటాయి, ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతో మేలు చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. బీట్‌రూట్‌లు బీటాలైన్‌లు అనే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి ఇవి కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. బీట్‌రూట్‌లు ఐరన్‌తో సమృద్ధిగా ఉంటాయి, ఇది రక్తహీనతను నివారిస్తుంది. 

కావలసిన పదార్థాలు:

బీట్‌రూట్ - 2
పసుపు - 1/4 tsp
ఉప్పు - రుచికి తగినంత
కారం - రుచికి తగినంత
కొత్తిమీర - కట్ చేసి
ఆవాలు - 1 tsp
జీలకర్ర - 1/2 tsp
కరివేపాకు - కొద్దిగా
ఎండు మిరపకాయలు - 2-3
నూనె - వేయడానికి తగినంత
బియ్యం పిండి - 1 కప్పు
చిటికెడు బేకింగ్ సోడా

తయారీ విధానం:

బీట్‌రూట్‌ను ఉడికించి, తురుముకోవాలి: బీట్‌రూట్‌ను శుభ్రం చేసి, ఉడికించి, తరువాత చిన్న చిన్న ముక్కలుగా కోసి లేదా గ్రేటర్‌తో తురుముకోవాలి. ఒక బౌల్‌లో తురుముకున్న బీట్‌రూట్, పసుపు, ఉప్పు, కారం, కొత్తిమీర కలిపి మిశ్రమం చేయాలి. మరొక బౌల్‌లో బియ్యం పిండి, బేకింగ్ సోడా వేసి, నీరు కలిపి పాకంలా కలపాలి. ఈ పాకంలో బీట్‌రూట్ మిశ్రమం కలిపి ఒకే రకంగా కలపాలి. కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. చేతితో చిన్న చిన్న ఉండలు చేసి నూనెలో వేయాలి. రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. వేయించిన వడలను కిచెన్ టవల్ మీద పెట్టి అదనపు నూనె తీసివేయాలి.

సర్వింగ్ సూచనలు:

బీట్‌రూట్ వడలను కారం పచ్చడి లేదా కొబ్బరి చట్నీతో సర్వ్ చేయవచ్చు.
ఇవి అల్పాహారం లేదా స్నాక్స్‌గా తినడానికి చాలా బాగుంటాయి.

గమనిక:

ఇష్టమైన మసాలాలు లేదా కూరగాయలు కూడా ఈ వంటకంలో చేర్చవచ్చు.
బీట్‌రూట్ వడలను ఫ్రిజ్‌లో 2-3 రోజులు నిల్వ చేయవచ్చు.

Also Read: Weight Loss Upma Recipe: శరీర బరువును తగ్గించే బ్రౌన్ ఉప్మా.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News