Prabhas Disaster Movies: ‘రాధే శ్యామ్’ సహా ప్రభాస్ కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్..

Prabhas Disaster Movies: ప్రతి హీరో కెరీర్ లో బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాటు అదే రేంజ్ డిజాస్టర్ మూవీస్ ఉండటం కామన్. అలాగే ప్రభాస్ కెరీర్ ‘బాహుబలి’ లాంటి ప్యాన్ ఇండియా సక్సెస్ అందుకున్న చిత్రాలతో పాిటు ‘ఆదిపురుష్’, ‘రాధే శ్యామ్’ వంటి ఫ్లాప్ చిత్రాలున్నాయి.

1 /8

ఆదిపురుష్: ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ రాఘవగా నటించిన చిత్రం 'ఆదిపురుష్'. రామాయణ ఇతిహాసాన్ని పూర్తిగా వక్రీకరించి తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.  

2 /8

రాధే శ్యామ్: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘రాధే శ్యామ్’. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

3 /8

సాహో:  ప్రభాస్ హీరోగా  సుజిత్ డైరెక్షన్ లో  తెరకెక్కిన చిత్రం ‘సాహో’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన విజయం సాధించలేదు.

4 /8

రెబల్ : లారెన్స్ దర్శకత్వంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, ప్రభాస్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘రెబల్’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

5 /8

ఏక్ నిరంజన్.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్, కంగనా హీరో, హీరోయిన్లుగా  తెరకెక్కిన చిత్రం ‘ఏక్ నిరంజన్’. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది.

6 /8

పౌర్ణమి.. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పౌర్ణమి’ చిత్రం బాక్సఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

7 /8

చక్రం.. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చక్రం’ మూవీ మంచి చిత్రంగా పేరు వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.

8 /8

ప్రభాస్ ఫ్లాప్ మూవీస్.. ప్రభాస్ కెరీర్ లో ఫ్లాప్ చిత్రాల కేటగిరిలో వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన యోగి, సురేశ్ కృష్ణ దర్శకత్వంలో రాఘవేంద్ర, మున్నా తదితర చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచాయి.