Deepavali 2024: దీపావళి రోజు ఎన్ని దీపాలు ఎక్కడెక్కడ పెట్టాలి? తెలుసుకోండి..

Deepavali 2024: దీపావళి పండుగను మన దేశంలో అంగరంగ వైభవంగా జరుపుకొంటారు. ఈనెల అక్టోబర్‌ 31న దీపావళి పండుగను జరుపుతారు. అయితే, అంతకు ముందు ధంతేరాస్‌ నిర్వహిస్తారు. దీపావళి పండుగ రోజు మనం ఇంట్లో దీపాలను వెలిగిస్తాం. ఎన్ని దీపాలు ఎక్కడెక్కడ వెలిగించాలి తెలుసుకుందాం
 

1 /5

దీపావళి పండుగ రోజు అంటేనే దీపాలకు ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి పూజలో ప్రమిద పెడతారు. ఇంటి బయట పూజగదిలో మట్టి దీపాలు వెలిగిస్తారు.  

2 /5

దీపావళి పండుగ రోజు రాముడి 14 ఏళ్ల వనవాసం తర్వాత తిరిగి రాజ్యానికి చేరుకుంటాడు. పురాణాల ప్రకారం ఆరోజు నుంచి దీపాలు వెలిగించారు. అది దీపావళి పండుగ అయింది.  

3 /5

ఇంట్లో ఈ రోజు దీపాలు పెట్టుకుంటారు. కొందరు మూడు రోజులు, ఐదు రోజులు పెడతారు. ఇంట్లో లక్ష్మీదేవితోపాటు గణేషుని కూడా పూజిస్తారు. ఈరోజుకు ముందు ధంతేరాస్, ధన్వంతరి పూజ చేస్తారు.  

4 /5

అయితే దీపావళిరోజు మొత్తం 13 దీపాలు వెలిగిస్తారు. ఇందులో ఒకటి లక్ష్మీదేవి వద్ద ఒకటి, పూజగదిలో రెండోది, మూడు ఆరుబయట, నాలుగు ఇంటి మిద్దపైన, ఐదు ఇంటి డస్ట్‌బిన్‌ పెట్టేచోట, వాష్‌రూం బయట కూడా పెడతారు. ఏడవ దీపం కిటికీల వద్ద పెడతారు.  

5 /5

అంతేకాదు ఎక్కడా ఈరోజు చీకటి లేకుండా దీపాలు వెలిగిస్తారు. ఒక దీపం తూర్పువైపుగా పెడతారు. యమదీపం వెలిగించేవారు ఆరోజు నుంచి మూడు, ఐదు రోజులు పెడతారు. ఇలా మొత్తంగా ఇంట్లో, ఆరుబయట కలిపి 13 దీపాలు వెలిగిస్తారు.