Tamannaah: ప్రియుడితో కలిసి దీపావళి సంబరాల్లో పాల్గొన్న తమన్నా.. పిక్స్ వైరల్..

Tamannaah: తమన్నా.. ఉత్తరాది భామ అయినా..తెలుగు, తమిళం సహా సౌత్ ఆడియన్స్ ప్రేక్షకుల మనసు దోచుకుంది.  ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నా దానికి భిన్నంగా.. రచ్చ గెలిచి ఇంట గెలిచింది తమన్నా. హీరోయిన్‌గా 2 దశబ్దాలు పూర్తి కావొస్తోన్న ఈ బ్యూటీ త్వరలో తన బాయ్ ఫ్రెండ్ తో ఏడడుగులు వేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా తన ప్రియుడితో కలిసి దీపావళి సంబరాల్లో పాల్గొంది.

1 /7

మిల్కీ బ్యూటీ తమన్నా.. తన యాక్టింగ్ కంటే గ్లామర్ తో ఎక్కువగా పాపులర్ అయింది. సినీ ఇండస్ట్రీకి వచ్చి త్వరలో 2 దశాబ్దాలు పూర్తి చేసుకోబోతుంది తమ్మూ. అయినా.. ఇప్పటికీ సింగిల్‌గా లైఫ్‌ను లీడ్ చేస్తోంది తమ్మూ.

2 /7

మిల్కీ బ్యూటీ  కెరీర్‌లో ఎన్ని హిట్స్ కంటే ఫ్లాపులే అధికంగా ఉన్నాయి. అయినా.. తన గ్లామర్ ప్లస్ పర్సనల్ ఇమేజ్‌తో ఇప్పటికీ హీరోయిన్‌గా సత్తా చాటుతునే ఉంది.

3 /7

భోళా శంకర్.. తమన్నా సినిమాల విషయానికొస్తే.. లాస్ట్ ఇయర్  మెగాస్టార్‌ చిరంజీవితో చేసిన 'భోళా శంకర్, బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

4 /7

  సూపర్ స్టార్ తలైవాతో 'జైలర్' సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఇందులో తమన్నా పాటకు సూపర్ క్రేజ్ వచ్చింది.

5 /7

18 యేళ్లుగా సినీ ఇండస్ట్రీని ఏలుతున్న ఈ భామ ఈ యేడాది తన ప్రియుడు విజయ్ వర్మను పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు అతనితో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది. దీపావళి ముందస్తు వేడుకలు అతనితో కలిసి సెలబ్రేట్ చేసుకుంది.

6 /7

తమన్నా ఆ మధ్య లస్ట్ స్టోరీస్ 2లో విజయ్ వర్మతో  కలిసి నటించింది. ఈ వెబ్ సిరీస్‌లో విజయ్ వర్మతో హాట్ ఇంటిమేట్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. అప్పటి నుంచి ఎక్కువగా అతనితోనే కనిపిస్తోంది.

7 /7

  ఈ యేడాది తమన్నా.. శ్రద్దా కపూర్.. ‘స్త్రీ 2’లో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. దాంతో జాన్ అబ్రహం ‘వేద’లో కూడా స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చింది.