Stroke Signs: స్ట్రోక్ సైలెంట్ కిల్లర్, లక్షణాలేంటి, ఎందుకొస్తుంది కారణాలేంటి

Stroke Signs: ఇటీవలి కాలంలో స్ట్రోక్ సమస్య అధికమౌతోంది. హార్ట్ ఎటాక్, స్ట్రోక్ కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఈ రెండింటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇవేమీ హఠాత్తుగా వచ్చేవి కావు. ముందస్తుగా కొన్ని సూచనలు ఇస్తుంటాయి. ఈ సూచనల్ని సకాలంలో గుర్తించగలగాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 30, 2024, 05:37 PM IST
Stroke Signs: స్ట్రోక్ సైలెంట్ కిల్లర్, లక్షణాలేంటి, ఎందుకొస్తుంది కారణాలేంటి

Stroke Signs: ఈ మధ్య కాలంలో గుండె పోటుతో పాటు బ్రెయిన్ స్ట్రోక్ ప్రధాన సమస్యగా మారింది. మెదడు రక్తాన్ని సరఫరా చేసే ఆర్టరీస్ దెబ్బతిన్నప్పుడు స్ట్రోక్ తలెత్తుతుంది. ఆక్సిజన్ లేదా పోషకాలు సరఫరా చేసే రక్త నాళిక చిట్లినప్పుడు లేదా క్లాట్ ఏర్పడితే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది నిజంగా చాలా ప్రమాదకర పరిస్థితి. మరి ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలి, లక్షణాలు ఎలా ఉంటాయనేది తెలుసుకుందాం.

శరీరంలో ఓ భాగం, ముఖం, చేతులు లేదా కాళ్లలో నిస్సత్తువ ఆవహిస్తుంది. ఒకటి లేదా రెండు కళ్లలో చూపు మందగిస్తుంది. అంటే డబుల్ విజన్ ఉంటుంది మసకగా కన్పించవచ్చు. ఏకాగ్రతలో మార్పు రావడం, తల తిరగడం, వాంతులతో పాటు విపరీతమైన తలనొప్పి అనేవి స్ట్రోక్ వచ్చే ముందు కన్పించే లక్షణాలుగా వైద్యులు పరిగణిస్తున్నారు. మాట్లాడటంలో ఇబ్బంది రావచ్చు అంటే మాట బయటకు రాదు లేదా తత్తరపాటు వస్తుంది. దాంతోపాటు ఇతరులు చెప్పేది అర్ధం కావడంలో ఇబ్బంది ఉంటుంది. బ్యాలెన్స్, సమన్వయం లోపించడం కూడా ఓ సంకేతం కావచ్చు. 

స్ట్రోక్ విషయంలో గుర్తుంచుకోవల్సిన ఫార్ములాను వైద్యులు చెబుతుంటారు. అదే BEFAST.ఈ పదం గుర్తుంచుకుంటే చాలు..ఇందులో ఒక్కో అక్షరం ఒక్కో సమస్యను సూచిస్తుంది. బి అంటే బ్యాలెన్సింగ్ ప్రోబ్లమ్ అని ఇ అంటే ఐ ప్రోబ్లమ్ అని అర్ధం చేసుకోవాలి. ఇక ఎఫ్ అంటే ఫేసియల్ ప్రోబ్లమ్ అని ఎ అంటే ఆర్మ్ వీక్నెస్ అని అర్ధం. ఎస్ అంటే స్పీచ్ ప్రాబ్లమ్ అని టి అంటే టైమ్ ఆఫ్ ఆన్‌సెట్ అని అర్ధం. ఈ లక్షణాల్లో ఏది కన్పించినా వెంటనే వైద్యుని సంప్రదించాలి. 

అసలు స్ట్రోక్ ఎందుకు వస్తుందనేది పరిశీలిస్తే చాలా కారణాలే కన్పిస్తాయి. వయస్సు ఓ కారణం. సాధారణంగా వృద్ధుల్లో కన్పిస్తుంది. కుటుంబంలో స్ట్రోక్ సమస్య ఉంటే ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. ఏట్రియల్ ఫిబ్రిలేషన్, టొబాకో, వ్యాయామం తగ్గడం, చెడు కొలెస్ట్రాల్ వల్ల కూడా స్ట్రోక్ సమస్య రావచ్చు. వీటితో పాటు అధిక రక్తపోటు, డయాబెటిస్, మద్యపానం, టెన్షన్ ఇతర కారణాలు. అందుకే ఈ సమస్యలను తగ్గించుకోగలిగితే స్ట్రోక్ ముప్పు తగ్గించవచ్చు. 

మరీ ముఖ్యంగా ధూమపానం, మద్యపానానికి స్వస్తి చెప్పాలి. మందులు, జీవనశైలిలో మార్పు ఉండాలి. బ్లడ్ ప్రెషర్, డయాబెటిస్ నియంత్రణలో ఉండాలి. టెన్షన్ లేకుండా ఉండేందుకు యోగా లేదా వ్యాయామం అలవర్చుకోవాలి. రోజూ 30 నిమిషాలు నడక తప్పకుండా ఉండాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్ధాలు తినాలి. ఫ్రైడ్ పదార్ధాలు, ప్రోసెస్డ్ లేదా ప్యాకెట్ ఫుడ్స్ మానేయాలి. హార్ట్ బీట్ సరిగ్గా లేకపోతే వైద్యుడిని సంప్రదించాలి. స్ట్రోక్ వస్తే 4-5 గంటలే గోల్డెన్ అవర్ అంటారు. ఈలోగా వైద్యుని సంప్రదించాలి. లేకపోతే ప్రాణాంతకం కావచ్చు. 

Also read: Diwali Healthy Gifts: దీపావళికి ఫ్యాన్సీ గిప్టులు వద్దు..హెల్తీ గిఫ్ట్స్ ఇవ్వండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News