Karnataka news: కాంగ్రెస్ సర్కారు ఇటీవల పలు రాష్ట్రాలలో మహిళలకు ఉచిత బస్సు పథకంను అమలు చేస్తొంది. ఈ నేపథ్యంలో తాజాగా, మహిళలకు ఫ్రీబస్సు పథకం ఎత్తేస్తున్నారని కూడా పుకార్లు వైరల్గా మారాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. మహిళలకు ఉచిత బస్సు పథకం కల్పిస్తామని ఎన్నికలకు ముందు కర్ణాటకలో ప్రచారంచేసింది. దీంతో ప్రజలు ఎన్నికలలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ కు పట్టం కట్టారు.
అనుకున్న విధంగానే కాంగ్రెస్ పార్టీ సీఎం సిద్దరామయ్య ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బస్సు పథకంను 2023 జూన్ 11న ఈ పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైన కూడా శక్తి అనే పథకంతో మహిళలకు ఫ్రీబస్సు సదుపాయం కల్పిస్తున్నారు.
తాజాగా కొంత మంది మహిళలు తాము టికెట్ లు కొని బస్సులో ప్రయాణిస్తున్నామని డిప్యూటీ సీఎం శివకుమార్ కు ఎక్స్ వేదికగా పోస్టులు సైతం చేసినట్లు తెలుస్తొంది. దీంతో శివకుమార్ దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
దీంతో డిప్యూటీ సీఎం శివకుమార్ మాట్లాడుతూ... కొన్నిరోజుల్లో జరగబోయే కేబినెట్ లో ఉచిత బస్సు ప్రయాణంపై మళ్లీ చర్చిస్తామని కూడా అన్నారు. దీంతో ఒక్కసారిగా తొందరలోనే ఫ్రీబస్సు ప్రయాణం రద్దుచేస్తారంటూ కూడా పుకార్లు వైరల్ గా మారాయి.
దీంతో దీనిపై పెద్ద రాజకీయా దుమారమే చెలరేగిందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ఏకంగా సీఎం సిద్దరామయ్య రంగంలోకి దిగారు. డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలకు తనకు తెలియదని, ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయాలనే ఆలోచన తమ సర్కారుకు లేదని కూడా స్పష్తం చేశారు.
అంతే కాకుండా.. డిప్యూటీ సీఎం శివకుమార్ కొంత మంది మహిళలు అలా ఎక్స్ లో పోస్టులు పెట్టారని మాత్రమే చెప్పారని, ఆయన వ్యాఖ్యల్ని కొంత మంది కావాలని వక్రీకరించారని కూడా అన్నారు. తమకు ఫ్రీబస్సు పథకం రద్దు చేసే ఆలోచన లేదని కుండ బద్దలు కొట్టినట్లు స్పష్టం చేశారు.