Kakinada: పండుగపూట విషాదం.. కాకినాడలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి దారుణహత్య..

Kakinada 3 Killed: పండుగపూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య తీవ్ర కలకలం రేపుతోంది. కాకినాడలో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా ఏపీ ఉలిక్కిపడింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /6

కాకినాడలోని చిన్న పేట గ్రామంలో దీపావళి పండుగరోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇరుకుటుంబాల నడుమ గొడవ ముగ్గురి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన నిన్న రాత్రి జరిగింది.  

2 /6

పోలీసుల వివరాల ప్రకారం ఇరు కుటుంబాల మధ్య ఉన్న చిన్న తగాదా కాస్త కత్తుల దూసుకునే వరకు తీసుకువచ్చింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు వదిలారు.  

3 /6

ఓ మహిళ విషయంలో ఈ హత్యలు జరిగాయని తెలుస్తోంది. ఈ ఘటనలో బత్తుల చిన్ని, బత్తుల రమేష్‌, బత్తు రాజు అనే ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే తీవ్ర గాయాలై ప్రాణాలొదిలారు.  

4 /6

కుటుంబ సభ్యుల సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.  

5 /6

అయితే, ఈ హత్యలకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఊళ్లో పరిస్థితులు అదుపులో ఉంచేందుకు పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.  

6 /6

ఘటన స్థలాన్ని స్వయంగా పరిశీలించిన ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ దర్యాప్తు వేగవంతం చేయిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిపై దాడికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ దాడి జరిగే సమయంలో కరెంటు కూడా ఆ ప్రాంతంలో లేకపోవడం గమనార్హం.. దాడి చేసిన వ్యక్తులు అక్కడి నుంచి పరారైపోయారు.