Allu arjun: ఏపీ హైకోర్టు ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తొంది. దీంతో అల్లు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో.. భాగంగా నంద్యాలకు వెళ్లిన ప్రచారం చేయడం వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఏపీ హైకోర్టు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిందని తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో అల్లు అర్జున్.. తన మిత్రుడు శిల్పరవి చంద్ర కిషోర్ రెడ్డికోసం వెళ్లి ప్రచారం చేసిన విషయం తెలిసిందే.
అంతే కాకుండా అక్కడ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని , ఎక్కువ మంది అభిమానులతో ప్రచారం నిర్వహించారని, కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై అప్పట్లో రాజకీయంగాను, సినిమారంగంలలో రచ్చగా మారింది.
ఈ ప్రచారంలో అల్లు ఫ్యామిలీకి , మెగాస్టార్ ఫ్యామిలీకి మధ్య దూరం పెరిగిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా.. పలు సినిమా కార్యక్రమాలలో తన అభిమానుల కోసం ఎంతదూరమైన వెళ్తానని కూడా అల్లు అర్జున్ అన్నారు.
ఈ నేపథ్యంలో హీరో అల్లు అర్జున్ కేసు నమోదు కావడం రాజకీయంగా దుమారంగా మారింది. ఈ క్రమంలో ఏపీ హైకోర్టులో ఈ కేసును కొట్టేయాలంటూ కూడా పిటిషన్ లను దాఖలు చేశారు. దీనిపై విచాణ జరిపిన హైకోర్టు తాజాగా.. ఈ కేసును కొట్టివేస్తున్నట్లు తీర్పును వెలువరించింది.
దీంతో అల్లు అర్జున్ అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పుష్పా 2 రిలీజ్ కోసం ఐకాన్ స్టార్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ వార్త మాత్రం అల్లు అభిమానుల్లో ఫుల్ జోష్ నింపిందని చెప్పుకొవచ్చు.