Senior ias smita sabharwal: సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ మళ్లీ వార్తలలో నిలిచారు. ఆమెకు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల తెలంగాణలో టూరిజం శాఖకు కల్చరల్ కమిషనర్ గా బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో స్మితా మళ్లీ ట్రెండింగ్ గా మారారు.
డైనమిక్ అధికారిణి స్మిత సబర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె తరచుగా వార్తలలో ఉంటారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో ఆమె కీలక బాధ్యతల్ని నిర్వర్తించారు.
అంతే కాకుండా.. ఆమె ఏ బాధ్యతలు అప్పగించిన కూడా డైనమిక్ గా ముందుకు వెళ్లడంతో తనకు సాటిలేదని ప్రూవ్ చేస్తుంటారు. కొన్ని నెలల క్రితం సివిల్స్ సర్వీసెస్ ఎగ్జామ్ లలో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అంటూ.. వివాదాస్పదంగా మాట్లాడారు.ఈ వ్యాఖ్యలు కోర్టుల వరకు వెళ్లాయి.
ఇదిలా ఉండగా.. సీఎం రేవంత్ సర్కారు మాత్రం.. తొలుత స్మిత సబర్వాల్ ను అంతగా ప్రాధాన్యతలేని బాధ్యతలు అప్పగించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆతర్వాత ఇటీవల స్మిత సబర్వాల్ కు తాజాగా.. తెలంగాణ టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్ మెంట్ కు కమిషనల్ గా నియమించింది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం స్మిత మహారాష్ట్రలో హల్ చేసినట్లు తెలుస్తొంది. కేంద్ర ఎన్నికల సంఘం స్మిత సబర్వార్ కు.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. అక్కడ అబ్జర్వర్ గా బాధ్యతలు అప్పగించిందని తెలుస్తొంది. ఈ క్రమంలో స్మిత సబర్వాల్ కు.. బుల్దానా, మల్కాపూర్ అసెంబ్లీ నియోజక వర్గ జనరల్ అబ్జర్వర్ గా నియమించారంట.
స్మిత సబర్వాల్ ప్రస్తుతం అక్కడకు వెళ్లి స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని ఓటింగ్ పై ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు కూడా స్మిత సబర్వాల్ ను ఆప్యాయంగా పలకరిస్తున్నారంట.
అంతే కాకుండా.. స్మిత సబర్వాల్ కు ఉన్నఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహారాష్ట్రలో కూడా స్మిత సబర్వాల్ తో మాట్లాడేందుకు.. సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడుతున్నారంట. దీంతో స్మిత సబర్వాల్ కు దేశ మంతట భలే ఫ్యాన్స్ ఉన్నరంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.