Nara Ramamurthy demise news: నారా చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఈ రోజు గుండెపోటుతో హైదరబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చనిపోయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో హుటా హుటీన చంద్రబాబు, నారా లోకేష్ ఆయన కుటుంబ సభ్యులు హైదరబాద్ కు చేరుకున్నారు.
నారా చంద్రబాబు సోదరుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు కొన్ని రోజులుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు హైదరబాద్ లో ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పోందుతూ తుదిశ్వాస విడిచారు.
ఈ విషయం తెలియగానే.. నారాలోకేష్, ఢిల్లీలో ఉన్న చంద్రబాబు హుటాహుటీన హైదరబాద్ కు బయలు దేరారు. బాలయ్య సైతం..తన ప్రొగ్రామ్స్ అన్ని క్యాన్షిల్ చేసుకుుని హైదరబాద్ కు చేరుకున్నారు
రామ్మూర్తి నాయుడు మరణ వార్త తెలియగానే.. పెద్ద ఎత్తున టీడీపీ అభిమానులు, ఆయన బంధువులు ఆస్పత్రికి చేరుకున్నారు. అంతే కాకుండా.. నారా రామ్మూర్తి నాయుడు స్వగ్రామంలో నారా వారిపల్లెతో తీవ్ర విషాదం నెలకొందని చెప్పుకొవచ్చు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే దేశ ప్రధాని మోదీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం నారా రామ్మూర్తి నాయుడు మరణం పట్ల తమ సంతాపం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఆస్పత్రికి టీడీపీ నేతలు చేరుకుంటున్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు, సుప్రీంకొర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, హిందుపురం ఎమ్మెల్యే బాలయ్య ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి నారా రామ్మూర్తి నాయుడు పార్థివదేహాన్ని సందర్శించారు. అంతే కాకుండా.. నారా రోహిత్ ను ఓదార్చారు.
ఏఐజీ ఆస్పత్రిలో ఉన్న నారా రామ్మూర్తి నాయుడు భౌతికకాయానికి మాజీమంత్రి మోత్కుపల్లి, తీగల కృష్ణారెడ్డి, సినీ నటుడు సుమన్, జీవిత నివాళులర్పించారు. అలాగే రామ్మూర్తి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. తన చిన్నాన్న.. అకాల మరణం పట్ల నారా లోకేష్ సైతం ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది. తన చిన్నాన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నట్లు సమాచారం.