Healthy Lungs Remedies: దేశ రాజధాని ఢిల్లీ వాతావరణం గురించి తెలిసిందే. కాలుష్యం రోజరోజుకూ పెరుగుతోంది. దీనికితోడు ధూమపానం. ఈ రెండింటి కారణంగా చాలామందికి ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతున్నాయి. కాలుష్యం, ధూమపానం కారణంగా లంగ్స్ మరింతగా పాడవుతున్నాయి. అయితే కొన్ని పండ్లు క్రమం తప్పకుండా తింటే లంగ్స్ హెల్తీగా మార్చుకోవచ్చు.
మన చుట్టూ ఉండే వాతావరణంలో కాలుష్యం, ధూమపానం కారణంగా లంగ్స్పై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఊపిరితిత్తుల్లో దుమ్ము ధూలి, వ్యర్ధాలు, విష పదార్ధాలు పేరుకుపోతున్నాయి. లంగ్స్ ఎప్పటికప్పుడు డీటాక్స్ చేయకపోతే ప్రాణాంతకం కాగలదు. అందుకే లంగ్స్ హెల్తీగా ఉండటం చాలా అవసరం. లంగ్స్ డీటాక్స్ చేసేందుకు కొన్ని పండ్లు తప్పకుండా డైట్లో భాగం చేసుకోవాలి. ఈ పండ్లు శరీరాన్ని శుద్ధి చేయడమే కాకుండా శ్వాస తాజాగా ఉండేలా చేస్తుంది. కాలుష్యం, ధూమపానం కారణంగా ఊపిరితిత్తులకు కలిగే నష్టాన్ని నివారిస్తాయి. ఈ పండ్లలో ముఖ్యమైంది పైనాపిల్. ఇందులో బ్రోమేలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ఊపిరితిత్తులకు చాలా ప్రయోజనం. ఈ ఎంజైమ్ శ్వాస నాళాల్ని శుభ్రం చేస్తుంది. ఊపిరితిత్తుల్లో పేరుకున్న కఫంను బయటకు తొలగిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి శరీరం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
నిమ్మలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తుల్ని డీటాక్స్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి. శరీరం పేరుకునే విష పదార్ధాల్ని బయటకు తొలగిస్తాయి. లంగ్స్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. రోజూ క్రమ పద్ధతిలో గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల ఊపిరితిత్తుల్లో పేరుకున్న పొగ, కాలుష్యం అంతా వేళ్లతో సహా బయటకు వచ్చేస్తుంది. ఇక బొప్పాయి మరో అద్భుతమైన ఫ్రూట్. ఇందులో ఉండే పెపైన్ అనే ఎంజైమ్ శ్వాస వ్యవస్థను శుభ్రపరుస్తుంది. లంగ్స్‌ను డీటాక్స్ చేస్తుంది. ఊపిరితిత్తుల్లో పేరుకున్న కఫం బయటకు తొలగిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు లంగ్స్ స్వెల్లింగ్, ఇన్ఫెక్షన్ను తగ్గిస్తాయి.
ఇక ద్రాక్షలో ఫైటోకెమికల్స్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి లంగ్స్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఊపిరితిత్తుల్లో స్వెల్లింగ్, మంటను తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే రెస్ వెరాట్రాల్ అనే పోషకం శ్వాస సంబంధ వ్యాధుల ముప్పును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. లంగ్స్ సామర్ధ్యాన్ని పెంచుతుంది. ఇక ఆపిల్ ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే. ఇందులో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు లంగ్స్ శుభ్రం చేస్తాయి. శరీరం నుంచి హానికారకమైన పదార్ధాలను బయటకు తొలగిస్తుంది.
Also read: Banana Remedies: రోజూ పరగడుపున అరటి పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.