Belly Fat Exercises: బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరిగించే 5 సులభమైన వ్యాయామాలు ఇవే

ఇటీవలి కాలంలో బెల్లీ ఫ్యాట్ సమస్య అధికంగా కన్పిస్తోంది. ఆధునిక జీవనశైలి, వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణం. బెల్లీ ఫ్యాట్ కారణంగా రక్తపోటు, డయాబెటిస్, గుండె వ్యాధుల సమస్యలు చుట్టుముడుతుంటాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు కొన్ని సులభమైన ఫిట్‌నెస్ టిప్స్ పాటించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే చాలా ఈజీగా బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది.

Belly Fat Exercises: ఇటీవలి కాలంలో బెల్లీ ఫ్యాట్ సమస్య అధికంగా కన్పిస్తోంది. ఆధునిక జీవనశైలి, వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణం. బెల్లీ ఫ్యాట్ కారణంగా రక్తపోటు, డయాబెటిస్, గుండె వ్యాధుల సమస్యలు చుట్టుముడుతుంటాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు కొన్ని సులభమైన ఫిట్‌నెస్ టిప్స్ పాటించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే చాలా ఈజీగా బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది.

1 /5

స్కిప్పింగ్ స్కిప్పింగ్ మీ బెల్లీ ఫ్యాట్‌ను అద్భుతంగా తగ్గిస్తుంది. అంతేకాకుండా మొత్తం శరీరాన్ని పటిష్టంగా మారుస్తుంది. రోజుకు కనీసం 5-10 నిమిషాలు స్కిప్పింగ్ చేయాలి

2 /5

మౌంటెయిన్ క్లైంబర్స్ ఇదొక బెస్ట్ కార్డియో ఎక్సర్‌సైజ్. బెల్లీ ఫ్యాట్ చాలా వేగంగా తగ్గుతుంది. ఫోటోలో చూపించిన భంగిమలో 20-30 సెకన్లపాటు ఉండాలి. ఇలా 10-12 సార్లు చేయాలి

3 /5

లెగ్ రేజ్ శరీరంలో లోయర్ ఎబ్స్‌ను టార్గెట్ చేస్తుంది. దీనికోసం వీపుపై పడుకుని కాళ్లను నిటారుగా పైకి లేపాలి. కొన్ని సెకన్లు అలానే ఉంచాలి. ఆ తరువాత నెమ్మది నెమ్మదిగా కిందకు దించాలి. ఇలా 10-15 సార్లు చేయాలి

4 /5

క్రంచెస్ క్రంచెస్ అనేది బెల్లీ ఫ్యాట్ తగ్గించేందుకు అద్బుతంగా ఉపయోగపడుతుంది. దీనికోసం వీపుపై పడుకుని మోకాళ్లు ముడవాలి. చేతుల్ని తల వెనక్కి పెట్టుకోవాలి. మీ భుజాల్ని నేల నుంచి పైకి లేపాలి. ఇలా 10-15 సార్లు చేయాలి.

5 /5

ప్లాంక్ ఇదొక సులభమైన అత్యంత ప్రభావవంతమైన వ్యాయామ ప్రక్రియ. ఇది శరీరంలోని కీలకమైన కండరాలను బలోపేతం చేస్తుంది. కడుపు ఆధారంగా బోర్లా పడుకుని మీ శరీరాన్ని మోచేతులు పంజా ఆధారంగా పైకి లేపాలి. ఇలా 30-60 సెకన్లు ఉంచి క్రమంగా సమయం పెంచాలి