Who is Zainab Ravdjee: అక్కినేని ఇంట పెళ్లి సందడి నెలకొన్న నేపథ్యంలో నాగార్జున మరో శుభవార్త చెప్పారు. అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ పూర్తయినట్ల ప్రకటించారు. తన మేనకోడలు జైనబ్ రావ్డ్జీను అఖిల్ వివాహం చేసుకోబోతున్నాడని.. నిశ్చితార్థం ఘనంగా జరిగినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన ఆయన ప్రకటన విడుదల చేశారు. అఖిల్ అక్కినేని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
డిసెంబర్ 4న నాగచైతన్య-శోభితల వివాహ మహోత్సవం జరగనున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోలో వీరి పెళ్లికి ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.
తన అన్న పెళ్లికి సిద్ధమవుతున్న నేపథ్యంలో అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ వార్తతో అందరినీ ఆశ్చర్యపరిచాడు.
జైనబ్ రావ్‌డ్జీని అఖిల్ అక్కినేని పెళ్లి చేసుకోనున్నాడు. వీరి ఎంగేజ్మెంట్ వార్తలతో ఒక్కసారి జైనబ్ ఎవరు..? అని నెటిజన్లు వెతుకుతున్నారు.
గతంలో మాజీ జగన్ సలహాదారుడిగా పని చేసిన జుల్ఫీ రావ్డ్జీ కూతురు జైనబ్ రావ్డ్జీ. ఆమె స్కిన్ కేర్ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్నట్లు ఇన్‌స్టా ప్రొఫైల్‌లో ఉంది. రానా దగ్గుపాటి, ఉపాసన వంటి స్టార్లు ఆమెను ఫాలో అవుతున్నారు.
"జైనబ్ రావ్డ్జీ, నేను సంతోషంగా నిశ్చితార్థం చేసుకున్నామని ప్రకటించేందుకు సంతోషిస్తున్నాను.." అని అఖిల్ ఇన్‌స్టా పోస్ట్ చేశాడు.