Pushpa 2 The Rule World Wide Pre Release Business: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ‘పుష్ప 2’. పుష్ప హిట్ నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అదే రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంతేకాదు ఇప్పటి వరకు మన దేశంలో ఈ రేంజ్ బిజినెస్ చేసిన ఏది లేదు.
Pushpa 2 The Rule World Wide Pre Release Business: అవును అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ మూవీ కలలో కూడా ఊహించని ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందనే చెప్పాలి. ఇప్పటి వరకు మన భారత దేశంలో ఆర్ఆర్ఆర్ మూవీ రూ. 451 కోట్ల అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన భారతీయ సినిమాగా రికార్డులకు ఎక్కింది.
అంతేకాదు పుష్ప రెండు పార్టులు కలిపి దాదాపు అల్లు అర్జున్ ఐదేళ్లు కేటాయించాడు. అంతేకాదు పుష్ప 1 సినిమాతో జాతీయ అవార్డుతో తెలుగుకు తొలి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. పుష్ప 2 కోసం ఏకంగా రూ. 300 కోట్ల పారితోషికం అందుకోను మన దేశంలోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేసాడు అల్లు అర్జున్.
తాజాగా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ దాన్ని దాటిపోయింది. తెలుగు నుంచి నాన్ రాజమౌళి హీరోగా అల్లు అర్జున్ క్రేజ్ నేషనల్ లెవల్లో ఏ రేంజ్ లో ఉందనేది ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే తెలుస్తోంది.
ముఖ్యంగా పుష్ప స్వాగ్ కు ఉత్తరాది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. రీసెంట్ గా పాట్నా, ముంబైలో జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన అభిమానులను చూస్తే అది అర్థమవుతోంది. అంతేకాదు కొచ్చి, చైన్నై ఇలా ప్యాన్ ఇండియా లెవల్లో బన్ని ఎక్కడికి వెళ్లిన ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు.
పుష్ప 2 ది రూల్ మూవీ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ విసయానికొస్తే.. ఏరియా వైజ్ గా చూస్తే.. తెలంగాణ (నైజాం)లో ఈ సినిమా రూ. 100 కోట్లు.. సీడెడ్ (రాయలసీమ).. రూ. 30 కోట్లు.. ఉత్తరాంధ్ర.. రూ. 23 కోట్లు..ఉమ్మడి తూర్పు గోదావరి .. 14.40 కోట్లు.. ఉమ్మడి పశ్చిమ గోదావరి.. రూ. 10.80 కోట్లు.. ఉమ్మడి గుంటూరు.. రూ. 15.20 కోట్లు.. ఉమ్మడి కృష్ణా .. రూ. 12.40 కోట్లు.. ఉమ్మడి నెల్లూరు.. రూ. 7.20 కోట్లు.. మొత్తంగా తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ మొత్తం కలిపి రూ. 213 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
పుష్ప 2 తెలుగు రాష్ట్రాల్లో హిట్ అందుకోవాలంటే రూ. 215 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవాలి. ఈ టార్గెట్ అందుకోవాలంటే ఈ సినిమాకు సూపర్ పాజిటివ్ టాక్ అత్యంత కీలకం అని చెప్పాలి.
ఇతర రాష్ట్రాలు.. ఓవర్సీస్ బిజినెస్ విషయానికొస్తే.. కర్ణాటక.. రూ. 32 కోట్లు.. తమిళనాడు.. రూ. 52 కోట్లు.. కేరళ..రూ. 20 కోట్లు.. హిందీ + రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి రూ. 200 కోట్లు.. ఓవర్సీస్.. రూ. 100 కోట్లు.. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 617 కోట్లు రాబట్టాలి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 620 బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవాలి.
తెలుగు సహా మన దేశంలో ఈ రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా ఏది లేదు. మరి పుష్ప 2 ది రూల్ మూవీ తెలుగు, హిందీ సహా అన్ని భాషల్లో ఈ సినిమా ఊర మాస్ గా ఓ 15 రోజులు నడిస్తే కానీ ఈ సినిమా హిట్ అనిపించుకోదు. మరి పుష్ప రాజ్ ఈ టార్గెట్ ను అందుకుంటాడా లేదా అనేది వెయిట్ అండ్ సీ.