Venu Swamy 2025 Zodiac Sign Prediction: 2025 సంవత్సరంలో కొన్ని రాశులవారి జీవితాల్లో పేను మార్పులు రాబోతున్నాయని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వేణుస్వామి తెలిపారు. ముఖ్యంగా వచ్చే ఏడాదిలో మేష రాశివారికి జీవితం పూర్తిగా మారుతుందని ఆయన అన్నారు. అయితే ఈ జాతకులకు వచ్చే ఏడాదిలో కలిగే మార్పులేంటో ఇప్పుడు తెలుసుకోండి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మేష రాశివారిని కృత్తికా 1 పాదముతో పాటు భరణి 3,4, 1,2 పాదాలు, అశ్విని 3,4,1,2 పాదములుగా భావిస్తారు. ఈ రాశివారికి ఉగాధి పంచాగం ప్రకారం.. రాజపూజ్యం 5గా ఉంటే.. అవమానం 7గా ఉంది.
ఈ సంవత్సరంలోనే మేష రాశివారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభం కాబోతోందని వేణు స్వామి అంటున్నారు. 24 సంవత్సరాలు నిండిన వారికి ఈ శని ప్రభావం రెండవ సారి వస్తుంది. జాతంలో రెండవ ఏలినాటి శని ఏర్పడడానికి జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఈ సమయంలో అనేక కష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వేణుస్వామి తెలిపారు.
మేష రాశివారికి 2025 సంవత్సరం నుంచి ఏలినాటి శని ప్రభావం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని వేణుస్వామి తెలుపుతున్నారు.
ఏలినాటి శని ప్రభావం వల్ల మేష రాశివారు పోలీస్ కేసుల్లో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని వేణుస్వామి అంటున్నారు. అంతేకాకుండా ఇంట్లో తల్లిదండ్రులకు కూడా అనేక అనారోగ్య సమస్యలు రావచ్చొట. ఇక మేష రాశివారికి ఈ సమయంలో యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
మేష రాశివారికి అదృష్టం సహకరించకపోవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వేణుస్వామి అంటున్నారు. అంతేకాకుండా ధనికుల ఇళ్లలో ఇన్కమ్ టాక్స్ దాడులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఏవైనా ఆస్తులు కొనుగోలు చేసే సమయంలో పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది.
ఇక వ్యాపారాలు చేసేవారు ఈ 2025 సంవత్సరంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మాత్రం ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. ఉద్యోగులు ప్రమోషన్స్ కూడా పొందుతారని వేణుస్వామి చెబుతున్నారు..