7th Pay Commission: కొత్త ఏడాదిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. డీఏ పెంపు అంతేనా..?

7th Pay Commission DA Hike 2025: కొత్త సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌ మొదటి పెంపు ఉండనుంది. కార్మిక మంత్రిత్వ శాఖ రిలీజ్ చేస్తున్న AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీఏను పెంచుతున్న విషయం తెలిసిందే. జూలై నుంచి డిసెంబర్ వరకు AICPI సూచిక సంఖ్యల ఆధారంగా జనవరి 2025 లో జీతాల పెంపుపై క్లారిటీ రానుంది. అయితే మరోసారి ఎంత జీతం పెరుగుతుందని ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు AICPI డేటా ఆధారంగా డీఏ ఎంతకు చేరిందో ఇక్కడ తెలుసుకుందాం..
 

1 /10

న్యూ ఇయర్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్‌ తగిలే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత మూడేళ్లతో పోలిస్తే డీఏ పెంపు తక్కువగా ఉంటుందని అంటున్నారు.  

2 /10

ఇటీవల దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏను పెంచిన విషయం తెలిసిందే. జనవరి నుంచి జూన్ నెల వరకు AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా డీఏను పెంచింది.  

3 /10

వచ్చే ఏడాది అంటే జనవరి 2025 డీఏను జూలై నుంచి డిసెంబర్ వరకు AICPI రిలీజ్ అయ్యే డేటాపై ఆధారపడి కేంద్రం పెంచుతుంది.  

4 /10

సెప్టెంబర్ నెల వరకు ఉన్న డేటా ప్రకారం.. ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ 2 నుంచి 3 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం.. డీఏ 54.49 శాతానికి చేరుకుంది.   

5 /10

అక్టోబరు, నవంబరు, డిసెంబర్‌ నెలలకు సంబంధించిన డేటా రిలీజ్ అయితే డీఏ పెంపుపై పూర్తి క్లారిటీ వస్తుంది.   

6 /10

సెప్టెంబర్ 2024 నాటికి AICPI సూచిక 143.3 పాయింట్లకు చేరుకుంది. ఇప్పటకే అక్టోబర్, నవంబర్ నెలలకు సంబంధించిన డేటా రిలీజ్ చేయాల్సి ఉండగా.. ఆలస్యం అవుతోంది.   

7 /10

ప్రస్తుతం ట్రెండ్‌ను బట్టి చూస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి 3 శాతం మాత్రమే డీఏ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  

8 /10

అక్టోబర్ డేటాతో ఇండెక్స్ 143.6కి చేరుకునే అవకాశం ఉంది. అప్పుడు 54.96 శాతానికి పెరగనుంది. నవంబర్‌లో ఇదే ట్రెండ్ కొనసాగితే.. 144 పాయింట్లకు చేరుకుటుంది. అప్పుడు డీఏ 55.41 శాతం వరకు పెరగవచ్చు. డిసెంబర్  ఇండెక్స్ 144.6 పాయింట్లకు చేరుకుంటే.. డీఏ 55.91 శాతానికి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.  

9 /10

జీతం పెంపు లెక్కలు ఇలా.. ఉద్యోగుల బేసిక్ పే రూ.18 వేలు అనుకుంటే.. డీఏ 56 శాతం అయితే.. జనవరి 2025 నుంచి DA:రూ.18,000 x 56% = రూ.10,080/నెలకు/డీఎ జూలై వరకు 2024: రూ.18,000 x 53%=రూ.9,540/నెలకు. 3 శాతం డీఏ పెంపు నెలకు రూ.540 వేలు పెరిగే అవకాశం ఉంటుంది.  అయితే ఇతర అలవెన్సులు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కారణంగా జీతంలో మార్పులు ఉంటాయి.  

10 /10

గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం కేవలం అవగాహన కోసమే రాసినది. వేతన రేటు పెంపుదలకు కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సందర్శించండి.