Tata Nexon Facelift Discount Offer: టాటా మోటార్స్ విడుదల చేసే ప్రతి కారుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా నెక్సాన్ ఎస్యూవీ (Tata Nexon Facelift) గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. గత ఏడాది విడుదలైన ఈ కార్లు మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముడు పోతున్నాయి. అలాగే అతి తక్కువ ధరలోనే హై ఎండ్ మోడల్స్ లభించడంతో చాలా మంది వీటినే కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
ఇప్పటికే చాలా మంది డీలర్స్ వద్ద నెక్సాన్ ఎస్‌యూవీల స్టాక్ మిగిలిపోయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా టాటా కంపెనీ ఈ కార్లపై ప్రత్యేకమైన డిస్కౌంట్‌ను అందంచబోతునట్లు తెలిపింది. అయితే టాటా అందించబోయే డిస్కౌంట్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
టాటా కార్లు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ ఛాన్స్‌గా చెప్పవచ్చు. పాపులర్ నెక్సాన్ ఎస్యూవీ(Tata Nexon Facelift)పై ఈ డిసెంబర్ నెలలో భారీ డిస్కౌంట్‌తో విక్రయించబోతోంది. ఏకంగా రూ.2.85 లక్షల డిస్కౌంట్‌ను అందిచనుంది.
ఈ నెక్సాన్ ఎస్యూవీను నెట్ క్యాష్తో కొనుగోలు చేసేవారికి అదనంగా స్క్రాపేజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా రూ.2.10 లక్షల వరకు బెనిఫిట్స్‌ను టాటా అందిచబోతోంది. ఇక 2024 విడుదల నెక్సాన్లపై రూ.45,000 వరకు తగ్గింపును అందిస్తోంది.
టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ (Tata Nexon Facelift) ఫీచర్స్ గురించి పెద్దగా చెప్పనక్కర్లే.. ఈ కారు కర్వ్ కాన్సెప్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా సెంటర్ కన్సోల్‌లో కూడా అనేక రకాల ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది.
ఈ స్మార్ట్ కారులో అన్ని రకాల కంట్రోల్స్ కోసం టచ్-ఆధారిత ప్యానెల్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా డ్యాష్‌బోర్డ్ లెదర్ ఇన్సర్ట్లు కూడా లభిస్తాయి. ఇవే కాకుండా 360-డిగ్రీ కెమెరా కూడా అందుబాటులో ఉంటుంది.
దీంతో పాటు వైర్లెస్ ఛార్జర్ సపోర్ట్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి కొత్త కొత్త ఫీచర్స్ కూడా లభించనున్నాయి. ఇవే కాకుండా అదనంగా ఎంజీలో ఉండే వాయిస్-అసిస్టెడ్ సన్‌రూఫ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.