Sobhita: అక్కినేని కొత్త కోడలు కట్టుకున్న చీర, నగల ధర ఎంతో తెలుసా..?

Sobhita Saree Cost: అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు నాగచైతన్య,  శోభిత మూడు ముళ్ళు ఏడడుగులతో అత్యంత సన్నిహితులు,  కుటుంబ సభ్యుల మధ్య సాంప్రదాయంగా ఒకటయ్యారు. బ్రాహ్మణ పద్ధతిలో వీరి వివాహం చాలా ఘనంగా జరిగింది. ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియోలో వీరిద్దరి పెళ్లికి సంబంధించి ఒక మంచి పెళ్లి సెట్ కూడా వేశారు.  ఆ సెట్లోనే నాగచైతన్య , శోభిత వివాహం చేసుకున్నారు. 
 

1 /4

ఇకపోతే వివాహం తర్వాత నాగార్జున వీరిద్దరి పెళ్లి సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. మా ఇంట్లో కొత్తదనం తీసుకొచ్చింది. మా మొహాల్లో కొత్త నవ్వు తీసుకొచ్చింది. ఇది పెళ్లి మాత్రమే కాదు.. ఒక ఎమోషనల్ బాండింగ్ అంటూ ఇలా అద్భుతంగా నాగార్జున తన కొడుకు నాగచైతన్య, కోడలు శోభిత పెళ్లి గురించి ట్వీట్ చేశారు.. 

2 /4

ఇకపోతే సెలబ్రిటీలు పెళ్లి చేసుకుంటే వాళ్ళు కట్టుకున్న చీరలు వేసుకున్న డ్రస్సులు ధరించిన నవల గురించి కూడా సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. ఇక సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్న నాగచైతన్య , శోభిత దూళిపాళ పెళ్లి బట్టలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇకపోతే శోభిత ధూళిపాల పెళ్లికి రెండు చీరలు కట్టుకుంది. ఇక పెళ్లిరోజు కట్టుకున్న చీరను నీతాలుల్ల డిజైన్ చేసింది ఆమె ఎంతోమంది సెలబ్రిటీలకు డిజైనర్ గా చేసిన విషయం తెలిసిందే అలాంటి నీతాలుల్ల దగ్గర శోభిత దూళిపాల తన పెళ్లి చీరను చాలా స్పెషల్గా డిజైన్ చేయించుకుందని సమాచారం. 

3 /4

ఈ పెళ్లి చీర కోసం దాదాపు మూడు లక్షల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. అలాగే మరో చీరకు కేవలం రూ.10, 000 మాత్రమే ఖర్చు పెట్టి సింపుల్ గా డిజైన్ చేశారట. అలాగే ఏడు వారాల నగలు కూడా ఈమె ధరించింది. ఇక శోభిత బ్రాహ్మణ అమ్మాయి కాబట్టి బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన ఆచార సాంప్రదాయాలన్నింటిని కూడా ఈ పెళ్లిలో ఫాలో అయినట్లు తెలుస్తోంది. 

4 /4

ఇకపోతే ఈ పసుపు దంచడం నుండి మొదలు మంగళ స్థానాలు, పెళ్లికూతురుని చేయడం ఇలా అన్ని కార్యక్రమాలను నిర్వహించారు. ఇక చివరిగా అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం వద్ద నాగచైతన్య,  శోభిత పెళ్లి బంధంతో ఒకటి అయ్యారు.