Aadhaar Update: ఆధార్ కార్డు ఉన్నవారికి బంపర్ గుడ్ న్యూస్.. మరోసారి గడువు పెంపు, వెంటనే అప్లై చేయండి..

Aadhaar Update Deadline Extended: ఆధార్ కార్డు కలిగిన వారికి బంపర్ గుడ్ న్యూస్. యూఐడీఏఐ మరోసారి ఉచితంగా ఆధార్‌ అప్డేడ్‌ చేసుకునే గడువును పెంచింది. పదేళ్లు పాతబడిన ఆధార్ కార్డును వెంటనే అప్డేట్ చేసుకోవాలని డిసెంబర్ 14వ తేదీ వరకు గడువు ఇచ్చింది. నేటితో ఆ సమయం ముగియనుంది. అయితే  తాజాగా మరోసారి గడువు పెంచింది యూఐడీఏఐ..
 

1 /8

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) 2024 డిసెంబర్ 14 తేదీ వరకు ఉచితంగా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఇది పదేళ్లు పాతబడిన ఆధార్ కార్డుదారులకు వర్తిస్తుంది.  

2 /8

అయితే నేటితో ఆ గడువు ముగియనుంది. తాజాగా మరోసారి ఈ ఆధార్ కార్డు ఉచితంగా అప్డేట్‌ చేసుకునే సౌలభ్యాన్ని యూఐడిఏ మరోసారి పెంచింది. ఇది పదేళ్లు పాతబడిన ఆధార్ కార్డుదారులకు మరోసారి గడువు పెంచింది. 2025 జూన్ 14వ తేదీ లోపు ఉచితంగా అప్డేట్ చేసుకునే సదుపాయం కల్పించింది..  

3 /8

'మై ఆధార్' పోర్టల్ ద్వారా ఉచితంగా అప్డేట్ చేసుకునే సౌలభ్యం కూడా కల్పించింది. మిలియన్ల కొద్ది ఆధార్ కార్డుదారులకు ఈ ఉచిత ఆఫర్ వర్తిస్తుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా యూఐడీఏఐ ప్రకటించింది.   

4 /8

పదేళ్లు పాతదైన తమ ఆధార్‌ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకోవాలంటే మీ సేవా లేదా ఆన్లైన్లో కూడా అప్డేట్‌ చేసుకునే సదుపాయం కల్పించారు.   

5 /8

యుఐడిఎఐ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో మీ ఆధార్ నంబర్, క్యాప్చా, ఓటిపి మొబైల్ నెంబరు ద్వారా సులభంగా అప్డేట్ చేసుకునే సదుపాయం ఉంది.  

6 /8

దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి ఎందుకంటే ఈ నంబర్ ద్వారా ట్రాకింగ్ చేసుకునే సదుపాయం కలిగి ఉంటుంది.  

7 /8

మీ ఆధార్ కార్డులో ఏ మార్పులు చేసుకోవాలన్న వెంటనే ఆ పని చేయడం మంచిది.. ఎందుకంటే ఆ తర్వాత మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఆధార్ కార్డు అనేది ఏ లావాదేవి చేసినా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి.  

8 /8

ఐదేళ్లలోపు  ఉన్న పిల్లలకు కూడా 'బాల్ ఆధార్ కార్డు' మనదేశంలో జారీ చేస్తారు.. అయితే 15 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆధార్ కార్డు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.. ఇందులో పేరు, ఫోట్, అడ్రస్‌, ఫోన్‌ నంబర్‌ వంటివి అప్డేట్‌ చేసుకోవచ్చు.