Zakir Hussain: స్వరకర్తకు అశ్రునివాలి.. ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్‌ అరుదైన చిత్రాలు..

Zakir Hussain Rare Photos: తబలా మాస్ట్రో జాకీర్ హుస్సేన్ సోమవారం ఉదయం మరణించారు. ఆయన 73 ఏళ్ల వయసులో అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కోలో తుది శ్వాస విడిచారు. వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యల వల్ల ఆయన మృతి చెందారు. ఈ స్వరకర్తకు ఎక్స్‌ వేధికగా ప్రముఖులు సానుభూతి తెలుపుతున్నారు. ఈ సందర్భంగా జాకీర్‌ హుస్సేన్‌ అరుదైన చిత్రాలు చూద్దాం.
 

1 /7

ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ నేడు శాన్‌ఫ్రాన్సికోలో చివరి శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో రాజకీయ నేతలు వ్యాపారవేత్తలు ఆయనకు ఎక్స్ వేదికగా అశ్రునివాలి, ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.  

2 /7

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఎక్స్‌ వేదికగా నివాళి అర్పించారు. జాకీర్ హుస్సేన్ కి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మ్యూజిక్ వరల్డ్ కు ఒక పెద్ద లాస్ట్ అని ఎక్స్ వేదికగా తెలిపారు.  

3 /7

ఈ స్వరకర్తకు పద్మ శ్రీ, పద్మభూషణ్‌, పద్మ విభూషణ్ ఉంది. ఆయన మ్యూజిక్ తో మంత్రముగ్ధులను చేసిన ప్రదర్శనలు కోకొల్లలు, అవి ఎప్పటికీ మర్చిపోలేనివి.  

4 /7

చిన్న వయసులోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన జాకీర్ హుస్సేన్ మొదట కచేరీ ప్రారంభించింది కూడా అమెరికాలోనే ఈయనకు మూడు గ్రామీ అవార్డులు కూడా ఉన్నాయి.  

5 /7

ఇక తాజ్ మహల్ టీ కు సంబంధించిన యాడ్‌తో మరింత మందికి పరిచయమయ్యారు. జకీర్ హుస్సేన్ యాడ్ మనసు లోతుల్లో ఇప్పటికీ నిలిచిపోయింది. అంతేకాదు జకీర్ హుస్సేన్ 'హిట్ అండ్ డస్ట్', ' సాజ్' వంటి చిత్రాల్లో కూడా కనిపించారు.  

6 /7

జాకీర్‌ హుస్సేన్‌ నటించిన మొఘల్‌ ఏ అజం అనే హిట్ చిత్రంతో ఆయన అందరినీ మెప్పించారు. జాకీర్ హుస్సేన్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు.  

7 /7

ఆయన మృతి పై చంద్రబాబు నాయుడు కూడా సంతాపం తెలియజేశారు. ఇక కేంద్రమంత్రి క్రిషన్ రెడ్డి కూడా జాకీర్ హుస్సేన్ మృతి పై తీవ్ర ప్రగాఢ సానుభూతి వాళ్ళ కుటుంబాలకు తెలియజేశారు.