Brahmamudi Today December 16th Episode: నేటి ఎపిసోడ్‌లో రాజ్ రోడ్‌పై పరధ్యానంతో నడుస్తుంటాడు. డ్రైవర్ వచ్చి కార్ ఎక్కించుకుపోతాడు. అప్పుడు ఫోన్‌లో రాజ్ తన ఫోలీస్ ఫ్రెండ్‌తో మాట్లాడుతాడు. ఆ చిట్‌ఫండ్ కంపెనీ వివరాలు తెలుసుకోమంటాడు. మరోవైపు కావ్యకు ఇంటి కష్టాలు మొదలవుతాయి.
వంట అది చేయలేదు..ఇది చేయలేదు అని రుద్రాణీ ఆడుకుంటుంది. అప్పుడే ధాన్యం కూడా వస్తుంది. పాలు లేవా ఒలకబోశావా? అడుతుంది. పాలు, పండ్లు సంగతి చూడు. కావాలని కాలక్షేపం చేయకు అంటుంది. మా నాన్న గారి ఆస్తి రాయగానే కళ్లు నెత్తికెక్కాయి అంటుంది రుద్రాణీ. చూపంతా ఆకాశంపైపు ఉంటే ఇవన్నీ ఎలా చూస్తుంది రుద్రాణీ అని ధాన్యం వెక్కిరిస్తుంది. బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి అంటుంది ధాన్యం. ఇక ఏసీ కూలింగ్ రావడంలే, సబ్బు ఆరిగిపోయింది అంటూ రుద్రాణీ వేధింపులు కావ్యకు ఎక్కువవుతుంటాయి. అయినా కావ్య ఒపిగ్గా అందరినీ పిలిచి రిపెయిర్ చేపిస్తా అంటుంది. అది కూడా మింగుడు పడదు రుద్రాణీ, ధాన్యలక్ష్మిలకు.
గేట్ వద్ద ఓ సెక్యూరిటీని నందగోపాల్ ఎక్కడ? అంటాడు రాజ్ తెలీదు కాల్ చేయండి అంటాడు. నంబర్ కూడా కలవడం లేదు అంటాడు రాజ్. నేనేం చేయలేను సార్, ఆయన వస్తే చెబుతా అంటాడు. అయితే, రూ.50 లక్షలు నేనే ఇవ్వాలి టైంకు ఆయనలేడు అని కథ చెబుతాడు రాజ్. వెంటనే సెక్యూరిటీ మా సార్ ఫామ్ హౌజ్‌లో ఉన్నాడు అని చెప్పేస్తాడు.
ఇంట్లో ధాన్యం చీరలకు డిజైన్లు ఎంపిక చేస్తుంది. అడ్వాన్స్ కావాలి అని డిజైనర్ అడుగుతుంది. దుగ్గిరాల కోడల్ని మొత్తం ఇస్తా అని కావ్యను పిలుస్తుంది. రూ.3 లక్షలు కావాలని హుకూం జారీ చేస్తుంది. కావ్యా ఆ డబ్బులు కూడా తెచ్చి ఇస్తుంది. బిల్ అసరం లేదు మీరు శారీ రెడీ చేసి తీసుకురండి అంటుంది ధాన్యం.
డిజైనర్ వెళ్లిపోయాక నువ్వు ఆమె ముందు పరువు ఎందుకు తీశావు? అని ధాన్యం కావ్యను నిలదీస్తుంది. మీ తాతయ్య గారు బాధ్యతలు అప్పజెప్పగానే సింహాసనం ఎక్కి కూర్చుంటాను, నేను చెప్పిందే శాసనం అంటే కుదరదు అని ఆర్డర్ వేసి వెళ్తుంది ధాన్యం. ఏంటి వీళ్లు లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నారు. ముందు నుంచే ఈ అలవాటు ఉందా? నాకు బాధత్యలు అప్పగించారని ఇలా చేస్తున్నారా? అని మనసులో అనుకుంటుంది.
మరోవైపు రాజ్ ఫామ్‌హౌజ్‌కు వెళ్తుంటాడు. నందగోపాల్ నువ్వు అక్కడ ఉన్న విషయం తెలిసిపోయింది. నువ్వు అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వు అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీంతో ఖంగుతిన్న నందగోపాల్ జారుకుంటాడు. రాజ్ వెళ్లి అడిగితే మా సార్ ఫారీన్ వెళ్లాడు అని చెబుతాడు. షిట్ తప్పించుకున్నాడు అని బాధతో ఆలోచిస్తుంటాడు. మళ్లీ పోలుసు ఫ్రెండ్ ఫోన్ చేసి దొరికడా? అంటాడు. లేదు అని రాజ్ అంటాడు. షిట్ ఎవరో మనం వస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు్నారు అంటాడు. మరి ఇప్పుడు ఎలా? అంటాడు రాజ్.
ఇంట్లో స్వప్న కావ్య ఎక్కడ కనిపించట్లేదు అని వెతుకుతుంది. నేను ఆన్‌లైన్‌లో డ్రెస్ బుక్ చేసుకున్నా అంటుంది స్వప్న. అయితే, లక్ష ఇవ్వు అంటుంది. ఇంటిల్లిపాది కొంటున్నావా? అంటుంది కావ్య. అప్పుడు కనకం కూతుర్ని ఇప్పుడు దుగ్గిరాలవారి కోడల్ని.. అంటుంది స్వప్న. ఇంత ఎందుకు ఖర్చు ఎందుకు మారిపోయావ్ అంటుంది కావ్య. నీకు ఇవేమీ అర్థం కావు. వెళ్లి డబ్బులు తీసుకురా అంటుంది. డబ్బు తెచ్చి ఇస్తుంది కావ్య. మంచి చెల్లి అని ముద్దు పెట్టుకుంటుంది స్వప్న. రుద్రాణీ సీన్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. దీన్నే అధికార దుర్వినయోగం అంటారు. నాకు డబ్బు అడిగితే, ఆరా తీస్తావు. మీ అక్క అడగగానే నచ్చినట్లు ఖర్చు చేస్తారా? అంటుంది రుద్రాణీ.
మాటలతో సరిపెడుతున్నా సంతోషించి మీరు మీ పని చూసుకోండి వెళ్లండి అంటుంది స్వప్న. అక్క ఆవిడను అనడం కాదు నువ్వు కూడా ఖర్చులు తగ్గించుకో అంటే నీకు ఎలాగో అలవాటు లేదు నన్ను అయినా ఎంజాయ్ చేయనివ్వు అని వెళ్లిపోతుంది స్వప్న. ఆ ఫ్రాడ్‌ను వెతుకు ఏ దేశంలో ఉన్న వెతికి పట్టుకో అంటాడు రాజ్. వాళ్ల కంపెనీకి మా తాతగారు వంద కోట్లు షూరిటీ ఇచ్చారు అంటాడు.
కాఫీ తీసుకుని నాలుగు సిప్‌లు వేయండి తలతగ్గిపోతుంది. ఎన్ని లక్షలు కట్టాలి? ఎన్ని కోట్లు కట్టాలి ఫైన్ చెప్పు వెంటనే కట్టేస్తా అని కావ్యపై విరుచుకుపడతుంటాడు రాజ్ మరుసటి ఎసిపోడ్‌లో..